బాలీవుడ్ పై కన్నేసిన కృతి
ఉప్పెనతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాప్ పొజిషన్ కు చేరుకుంది కృతి షెట్టి. ఆ సినిమాతో వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటోంది. ఇలా ఓవైపు తెలుగులో నటిస్తూనే ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది ఈ ఉప్పెన బ్యూటీ. ఈమధ్యే కృతికి బాలీవుడ్ లో ఓ సంస్థ నుండి కాల్ వచ్చిందట. హీరో-దర్శకుడు అంతా సెట్ అయిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రాబోతోందట. ఈ ఆఫర్ కు కృతి ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి కృతి […]
ఉప్పెనతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాప్ పొజిషన్ కు చేరుకుంది కృతి షెట్టి. ఆ సినిమాతో వరుసపెట్టి
ఆఫర్లు అందుకుంటోంది. ఇలా ఓవైపు తెలుగులో నటిస్తూనే ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది ఈ ఉప్పెన
బ్యూటీ.
ఈమధ్యే కృతికి బాలీవుడ్ లో ఓ సంస్థ నుండి కాల్ వచ్చిందట. హీరో-దర్శకుడు అంతా సెట్ అయిన ఈ
ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రాబోతోందట. ఈ ఆఫర్ కు కృతి ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి
కృతి పుట్టింది బెంగళూరులో అయినప్పటికీ.. పెరిగింది మొత్తం ముంబైలోనే. అక్కడే ఆమె చదువుకుంది.
ఎన్నో యాడ్స్ లో నటించింది. అప్పటి నుండి అక్కడ మేనేజర్స్ తో ఆమెకి కాంటాక్ట్ ఉంది.
అయితే ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాలీవుడ్ మూవీకి ఎలా కాల్షీట్లు కేటాయిస్తుందనేది సస్పెన్స్.
ప్రస్తుతం కృతి చేతిలో మూడు సినిమాలున్నాయి. నానితో ‘శ్యామ్ సింగ రాయ్’, సుదీర్ బాబుతో ‘ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తున్న కృతి త్వరలోనే రామ్ -లింగుస్వామి సినిమాలో
కూడా నటించబోతుంది.