రవితేజ కొత్త సినిమా సంగతులు
ఆల్రెడీ ఖిలాడీ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు రవితేజ. వచ్చేనెల చివర్లో ఖిలాడీ షెడ్యూల్ ను దుబాయ్ లో కూడా ప్లాన్ చేశారు. ఈ గ్యాప్ లో మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మాస్ రాజా. `క్రాక్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజను ఇంతవరకూ చూడని […]
ఆల్రెడీ ఖిలాడీ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు రవితేజ. వచ్చేనెల చివర్లో ఖిలాడీ షెడ్యూల్ ను
దుబాయ్ లో కూడా ప్లాన్ చేశారు. ఈ గ్యాప్ లో మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మాస్ రాజా.
'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్
ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా
తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నారు
దర్శకుడు శరత్ మండవ.
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుండి హైదరాబాద్‌లోని
అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే ఖిలాడీ షూట్ కోసం
దుబాయ్ వెళ్తాడు రవితేజ. ఇంకా పేరు పెట్టని కొత్త దర్శకుడి సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం
అందిస్తున్నాడు.