పుకార్లను ఖండించిన మెహ్రీన్
రెండు రోజులుగా మెహ్రీన్ పై పుకార్లు జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణ సరసన ఆమె నటించబోతోందని, భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకోబోతోందంటూ కథనాలు వస్తున్నాయి. మరో హీరోయిన్ అయితే, ఇలాంటివి చూసీచూడనట్టు వదిలేస్తుంది. కానీ అక్కడున్నది మెహ్రీన్. తనపై ఎలాంటి పుకారు వచ్చినా దానిపై క్లారిటీ ఇవ్వడం మెహ్రీన్ కు అలవాటు. అందుకే ఈసారి కూడా రియాక్ట్ అయింది. బాలయ్య సినిమాలో తను నటించడం లేదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది మెహ్రీన్. ఈరోజు ఉదయం ట్విట్టర్ లోకొచ్చిన ఈ […]
రెండు రోజులుగా మెహ్రీన్ పై పుకార్లు జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణ సరసన ఆమె నటించబోతోందని,
భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకోబోతోందంటూ కథనాలు వస్తున్నాయి. మరో హీరోయిన్ అయితే,
ఇలాంటివి చూసీచూడనట్టు వదిలేస్తుంది. కానీ అక్కడున్నది మెహ్రీన్. తనపై ఎలాంటి పుకారు వచ్చినా
దానిపై క్లారిటీ ఇవ్వడం మెహ్రీన్ కు అలవాటు. అందుకే ఈసారి కూడా రియాక్ట్ అయింది.
బాలయ్య సినిమాలో తను నటించడం లేదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది మెహ్రీన్. ఈరోజు
ఉదయం ట్విట్టర్ లోకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తను మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్
హీరోగా ఓ ఓటీటీ సినిమా చేస్తున్నానని, అంతకుమించి తన చేతిలో మరో సినిమా లేదని స్పష్టంచేసింది.
ఒకవేళ, ఏదైనా సినిమాకు కమిట్ అయితే తనే స్వయంగా వివరాలు వెల్లడిస్తానని.. అప్పటివరకు ఎవ్వరూ
పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తోంది ఈ బ్యూటీ. మారుతి సినిమాతో పాటు మెహ్రీన్ చేతిలో ఎఫ్3 మూవీ
కూడా ఉంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.