Telugu Global
Cinema & Entertainment

శ్రీరాముడిగా సంపూర్ణేష్ బాబు

‘కొబ్బరిమట్ట’ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాలీఫ్లవర్‌’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, బ్యాంగ్‌ వీడియోకు మంచి స్పందన‌ లభించింది. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌ మ్యాన్‌గా సంపూ ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఈ […]

శ్రీరాముడిగా సంపూర్ణేష్ బాబు
X

‘కొబ్బరిమట్ట’ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న
తాజా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాలీఫ్లవర్‌’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్కే
మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ఇటీవల
విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, బ్యాంగ్‌ వీడియోకు మంచి స్పందన‌ లభించింది. ఇంగ్లాండ్‌
నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌ మ్యాన్‌గా సంపూ ఈ చిత్రంలో కనిపిస్తాడు.

ఈ క్యాలీఫ్లవర్‌ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్‌ పూర్తయిన
విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని సంపూర్ణేష్‌బాబు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌.
ఇందులో రాముడి అవతారంలో సంపూ కనిపిస్తున్నాడు.

గోపీకిరణ్‌ ఈ సినిమాకు కథ అందించారు. సంపూర్ణేష్‌బాబు సరసన ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌గా
నటిస్తున్నారు. సంపూ గత సినిమాల్లానే ఇందులో కూడా హిలేరియస్ కామెడీ అంటుందంటోంది యూనిట్.

First Published:  26 Jun 2021 1:30 PM IST
Next Story