గుడ్ బై చెప్పిన కొరటాల శివ
ఊహించని విధంగా ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు కొరటాల. తను సోషల్ మీడియా నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తనకు సమయం సరిపోవడం లేదని, అందుకే తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా ప్రకటించాడు కొరటాల. “నేను సోషల్ మీడియా నుండి వెళ్ళిపోతున్నాను. దీని ద్వారా మీతో ఎన్నో విషయాలు పంచుకున్నాను. ఎన్నో జ్ఞాపకాలు. కానీ ఇప్పుడు వీటన్నిటినీ వదిలేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే సోషల్ మీడియాలో లేకపోయినా మీడియా మిత్రుల ద్వారా మీతో టచ్ లో ఉంటాను. మీడియం మాత్రమే […]
ఊహించని విధంగా ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు కొరటాల. తను సోషల్ మీడియా నుంచి పూర్తిగా
తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తనకు సమయం సరిపోవడం లేదని, అందుకే తప్పుకుంటున్నానని ఈ
సందర్భంగా ప్రకటించాడు కొరటాల.
“నేను సోషల్ మీడియా నుండి వెళ్ళిపోతున్నాను. దీని ద్వారా మీతో ఎన్నో విషయాలు పంచుకున్నాను.
ఎన్నో జ్ఞాపకాలు. కానీ ఇప్పుడు వీటన్నిటినీ వదిలేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే సోషల్
మీడియాలో లేకపోయినా మీడియా మిత్రుల ద్వారా మీతో టచ్ లో ఉంటాను. మీడియం మాత్రమే మారింది
మన బాండింగ్ మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతుంది”
ఇలా ప్రకటించి, అలా సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు కొరటాల. మరో 12 రోజుల షూటింగ్ తో
ఆచార్య పూర్తయిపోతుందని, ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాపై పూర్తిగా దృష్టిపెడతానని
ప్రకటించారు కొరటాల. వివాదాలకు దూరంగా ఉండే కొరటాల, ఇలా అర్థాంతరంగా సోషల్ మీడియాను
వీడడం, అతడి ఫ్యాన్స్ కు కాస్త బాధ కలిగించే విషయమే.