Telugu Global
NEWS

ఏపీలో డెల్టా ప్లస్​ వేరియంట్​.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి..!

కరోనా సెకండ్​ వేవ్​ నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ ఎత్తేశాయి. ఇదిలా ఉంటే కరోనా థర్డ్​వేవ్​ ముప్పు పొంచిఉందని.. మన దేశంలో డెల్టాప్లస్​ వేరియంట్​ వ్యాపించే అవకాశం ఉందని.. ఈ సారి మరణాల సంఖ్య మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు వైద్యులు, శాస్త్రవేత్తలు మాత్రం.. థర్డ్​వేవ్​ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని.. ప్రజలు భయపడాల్సిన అవసరం […]

ఏపీలో డెల్టా ప్లస్​ వేరియంట్​.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి..!
X

కరోనా సెకండ్​ వేవ్​ నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ ఎత్తేశాయి. ఇదిలా ఉంటే కరోనా థర్డ్​వేవ్​ ముప్పు పొంచిఉందని.. మన దేశంలో డెల్టాప్లస్​ వేరియంట్​ వ్యాపించే అవకాశం ఉందని.. ఈ సారి మరణాల సంఖ్య మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరికొందరు వైద్యులు, శాస్త్రవేత్తలు మాత్రం.. థర్డ్​వేవ్​ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని దైర్యం చెబుతున్నారు. మొత్తంగా ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అందరూ సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్​లో డెల్టా ప్లస్​ వేరియంట్​ కనిపించినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతిలో మంగళంకు చెందిన ఓ వ్యక్తికి 2 నెలల క్రితమే .. డెల్టాప్లస్​ వేరియంట్​ వచ్చింది. అయితే పూణే ల్యాబ్​ ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది.డెల్టాప్లస్​ వేరియంట్​ వచ్చిన వ్యక్తి కూడా కోలుకున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. ఆ ఇంట్లోని వారందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. వారు నివసిస్తున్న ప్రాంతంలో కూడా పలువురికి కూడా కరోనా వైరస్ సోకింది.

దీనిపై వైద్య నిపుణులు మాట్లాడుతూ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి, ఆ ఇంట్లోని వారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఆ ప్రాంతంలో కరోనా కేసులు సాధారణ స్థాయిలో నమోదయ్యాయే కానీ, అత్యధిక స్థాయిలో నమోదయింది లేదని, ప్రాణ నష్టం కూడా మరీ ఎక్కువగా లేదని వారు చెబుతున్నారు.
దీనిని బట్టి డెల్టా ప్లస్ వేరియంట్ మరీ ప్రమాదకరం కాదని వారు చెబుతున్నారు.

ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందిస్తూ డెల్టాప్లస్ వేరియంట్ పై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్​ వేరియంట్​ గుర్తించినట్టు డాక్టర్లు చెబుతున్నారు.

First Published:  26 Jun 2021 7:36 AM IST
Next Story