Telugu Global
NEWS

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. కొత్త విద్యాసంవత్సరానికి లైన్ క్లియర్..

ఓవైపు తెలంగాణలో జులై 1నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలవుతోంది. ముందుగా 9, 10 తరగతులు, ఆ తర్వాత విడతల వారీగా చిన్న తరగతులకు పాఠాలు మొదలు కాబోతున్నాయి. కానీ ఏపీలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతుండడంతో విద్యాసంవత్సరం కూడా కొన్నాళ్లు వాయిదా పడుతుందని అనుకున్నారు. అయితే తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడంతో ఏపీలో కూడా కొత్త విద్యాసంవత్సరానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణపై […]

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. కొత్త విద్యాసంవత్సరానికి లైన్ క్లియర్..
X

ఓవైపు తెలంగాణలో జులై 1నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలవుతోంది. ముందుగా 9, 10 తరగతులు, ఆ తర్వాత విడతల వారీగా చిన్న తరగతులకు పాఠాలు మొదలు కాబోతున్నాయి. కానీ ఏపీలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతుండడంతో విద్యాసంవత్సరం కూడా కొన్నాళ్లు వాయిదా పడుతుందని అనుకున్నారు. అయితే తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడంతో ఏపీలో కూడా కొత్త విద్యాసంవత్సరానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.

పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతోపాటు, పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని జులై 31లోగా పూర్తి చేయాలని సూచించడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమయం సరిపోనందున పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయలోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఫలితాలు ఎలా..?
ఫలితాల విడుదలపై విధివిధానాలు రూపొందించేందుకు హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. మార్కుల మదింపు ఎలా చేయాలన్నదానిపై పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు.
గతేడాది టెన్త్ పరీక్షలను రద్దు చేసినా, విద్యార్థులకు ఎలాంటి మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేదు. ఉత్తీర్ణులైనట్లు మాత్రమే పేర్కొంటూ మార్కుల జాబితాలు ఇచ్చారు. ఈ ఏడాది టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారని తెలుస్తోంది. టెన్త్ క్లాస్ లో అప్పటి వరకు జరిగిన అంతర్గత పరీక్షల ఆధారంగా ఈ గ్రేడ్లు కేటాయిస్తారు. ఈ ఏడాది మొత్తం 6,28,359 మంది విద్యార్థులు పది పాసైపోయారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కులు, ప్రాక్టికల్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయిస్తారని చెబుతున్నారు. ఏపీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది నేరుగా సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అవుతుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 5,19,510 మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్టయింది.

First Published:  24 Jun 2021 8:55 PM GMT
Next Story