Telugu Global
Cinema & Entertainment

మ్యాస్ట్రో.. డైరక్ట్ ఓటీటీ విడుదల

అనుమానాలే నిజమయ్యాయి. మాస్ట్రో సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశారు. నితిన్ లాంటి ఓ పెద్ద హీరో నటించిన సినిమాను ఇలా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేయడం ఈమధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైమ్. గతంలో నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన ”వి” అనే సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేశారు. అప్పుడంటే పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. రేపోమాపో ఏపీలో కూడా థియేటర్లు […]

మ్యాస్ట్రో.. డైరక్ట్ ఓటీటీ విడుదల
X

అనుమానాలే నిజమయ్యాయి. మాస్ట్రో సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ
రిలీజ్ కు ఇచ్చేశారు. నితిన్ లాంటి ఓ పెద్ద హీరో నటించిన సినిమాను ఇలా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు
ఇచ్చేయడం ఈమధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైమ్. గతంలో నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన ”వి” అనే
సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేశారు. అప్పుడంటే పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు
అదుపులోనే ఉన్నాయి. రేపోమాపో ఏపీలో కూడా థియేటర్లు తెరుస్తారు. అయినప్పటికీ మాస్ట్రో మేకర్స్
ఆగలేకపోయారు. డిస్నీ హాట్ స్టార్ ఆఫర్ చేసిన డీల్ అలాంటిది మరి.

హిందీలో హిట్టయిన అంధాధూన్ అనే సినిమాకు రీమేక్ గా మాస్ట్రో తెరకెక్కింది. ఈ సినిమా కోసం నితిన్
తండ్రి నిర్మాతగా మారాడు. దాదాపు 29 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాడని టాక్. ఇప్పుడు ఈ ప్రాజెక్టును
డిస్నీ సంస్థ 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే స్పాట్ లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి 3
కోట్ల లాభం అన్నమాట. ఇది కాకుండా.. ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ నిర్మాత దగ్గరే ఉన్నాయి.
అటు ప్రమోషన్ ఖర్చు ఓ కోటి రూపాయల వరకు మిగులు.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఎందుకిచ్చారనేది ఇప్పటికీ
అంతుచిక్కని ప్రశ్న. ఈ సినిమాలో నితిన్ అంధుడిగా నటించాడు. తమన్న విలన్. సబ్జెక్ట్ కూడా కాస్త
టిపికల్. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగు థియేటర్లలో నడుస్తుందో నడవదో అనే అనుమానంతో ఇలా డైరక్ట్ ఓటీటీకి
ఇచ్చేశారేమో అనుకోవాలి. అంతేతప్ప, ఇక్కడ డబ్బులు సమస్య కాదు.

First Published:  25 Jun 2021 10:09 AM IST
Next Story