Telugu Global
Health & Life Style

కోవిడ్ నుంచి కోలుకుంటే సింగిల్ డోస్ సరిపోతుందా..?

భారత్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలన్నీ డబుల్ డోస్ వే. ‘స్పుత్నిక్ లైట్’ అనే సింగిల్ డోస్ టీకా త్వరలోనే వస్తుందని అంటున్నా.. ఇంకా ‘స్పుత్ని-వి’ నే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి, ‘లైట్’ ని ఇంకొన్నాళ్లు లైట్ తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు కొత్తగా మరో వాదన తెరపైకి వస్తోంది. ఇటీవల దీనిపై కొన్నిపరిశోధనలు కూడా జరిగాయి. చివరకు ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఒకడోసు సరిపోతున్నట్టు తేలింది. ఈశాన్య రాష్ట్రాలు, […]

కోవిడ్ నుంచి కోలుకుంటే సింగిల్ డోస్ సరిపోతుందా..?
X

భారత్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలన్నీ డబుల్ డోస్ వే. ‘స్పుత్నిక్ లైట్’ అనే సింగిల్ డోస్ టీకా త్వరలోనే వస్తుందని అంటున్నా.. ఇంకా ‘స్పుత్ని-వి’ నే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి, ‘లైట్’ ని ఇంకొన్నాళ్లు లైట్ తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు కొత్తగా మరో వాదన తెరపైకి వస్తోంది. ఇటీవల దీనిపై కొన్నిపరిశోధనలు కూడా జరిగాయి. చివరకు ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఒకడోసు సరిపోతున్నట్టు తేలింది. ఈశాన్య రాష్ట్రాలు, దిబ్రూగఢ్ లో జరిపిన అధ్యయనం ప్రకారం ఈ విషయాలను వెల్లడించింది ఐసీఎంఆర్. కొవిడ్‌-19 బారిన ప‌డి కోలుకుని, రోగనిరోధక శక్తి పొందిన వారికి సింగిల్ డోస్ కోవిషీల్డ్ స‌రిప‌డా భ‌ద్ర‌త క‌ల్పిస్తుంద‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది.

ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ టీకాల లభ్యత తక్కువగా ఉంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం వివిధ రకాల అధ్యయనాలను ప్రోత్సహిస్తోంది. టీకాకు, టీకాకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంచడం, సింగిల్ టీకాతో హెర్డ్ ఇమ్యూనిటి సాధించే సామర్థ్యం.. ఇలా వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల వల్లే గతంలో రెండు డోసుల మధ్య రెండు వారాల గ్యాప్ అనేవారు.. ఇప్పుడు ఏకంగా 6 వారాలకు పెంచారు. అంటే ఈ గ్యాప్ లో కొత్తవారికి టీకాలు వేయొచ్చు, పాతవారికోసం కొత్త టీకాలు వచ్చే వరకు వేచి చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా జరిగిన అధ్యయనం సింగిల్ డోస్ చాలని తేల్చేయడంతో సగం భారం తప్పినట్టే. కోవిడ్ నుంచి కోలుకున్నవారి లిస్ట్ ఎలాగూ ప్రభుత్వం వద్ద ఉంటుంది కాబట్టి, వారందరికీ సింగిల్ డోస్ టీకా ఇచ్చేసి ఆ మిగిలిన డోసుని వేరొకరికి అందించవచ్చు. ఇలా చేయగలిగితే భారత్ లో వ్యాక్సినేషన్ వేగవంతం అవుతుందని, హెర్డ్ ఇమ్యూనిటీ త్వరగా సాధించగలుతామని అంటున్నారు పరిశోధకులు.

ఇక తాజా అధ్యయనం విషయానికొస్తే. 121మందిపై ఈ పరిశోధన జరిగింది. వీరిలో కొందరు కరోనా సోకనివారు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు. మరికొందరు కరోనాని జయించి కేవలం ఒక డోసు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉన్నారు. వీరికి ఐజీఈ యాంటీబాడీ పరీక్ష జరిపారు. రెండు డోసులు తీసుకున్నవారికంటే, కోవిడ్ నుంచి కోలుకుని సింగిల్ డోసు తీసుకున్నవారిలోనే ఈ యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయితే దీనిపై మరింతగా పరిశోధన చేపట్టబోతున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

First Published:  25 Jun 2021 2:46 AM IST
Next Story