బాహుబలి దారిలో సలార్
బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎంత హిట్టయిందో, రెండో భాగం అంతకుమించి హిట్టయింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టింది. ప్రస్తుతం ఇదే కోవలో పుష్ప సినిమా తెరకకెక్కుతోంది. పార్ట్-1, పార్ట్-2గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సినిమా కూడా చేరబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సలార్ ను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. దీనిపై ఇంకా అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు. […]
బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎంత హిట్టయిందో, రెండో భాగం అంతకుమించి
హిట్టయింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టింది. ప్రస్తుతం ఇదే కోవలో పుష్ప సినిమా
తెరకకెక్కుతోంది. పార్ట్-1, పార్ట్-2గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సినిమా
కూడా చేరబోతోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే సలార్ ను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట
మేకర్స్. దీనిపై ఇంకా అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు. నిజానికి ఇలా రెండు భాగాలుగా ఒకే సినిమాను
తీయడం అటు దర్శకుడికి, ఇటు హీరోకు కొత్త కాదు.
ప్రభాస్ ఆల్రెడీ బాహుబలి చేశాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చేశాడు. కాబట్టి
సలార్ ను కూడా 2 భాగాలుగా తీసుకురావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దీనిపై యూనిట్ ఎప్పుడు
స్పందిస్తుందో చూడాలి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్
అవుతుంది.