Telugu Global
Cinema & Entertainment

రామ్ కూడా షూటింగ్ కు రెడీ

రెడ్ సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ గ్యాప్ తీసుకున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు కానీ, తన మైండ్ సెట్ మాత్రం మార్చుకోలేదు. మాస్-యాక్షన్ పంథాలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే లింగుసామి దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ సినిమా కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతున్నాడు రామ్ పోతినేని. ప్రస్తుతం జిమ్ లో కసరత్తులు చేస్తూ, కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. అటు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ […]

ram-red-success
X

రెడ్ సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ గ్యాప్ తీసుకున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు కానీ, తన మైండ్ సెట్
మాత్రం మార్చుకోలేదు. మాస్-యాక్షన్ పంథాలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో
భాగంగానే లింగుసామి దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇప్పుడీ సినిమా కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతున్నాడు రామ్ పోతినేని. ప్రస్తుతం జిమ్ లో
కసరత్తులు చేస్తూ, కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. అటు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్ డేట్
కూడా వచ్చేసింది. జులై రెండో వారం నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.

రామ్ అయితే ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. చేతిలో ఈ సినిమా తప్ప మరో పని లేదు. కానీ హీరోయిన్
కృతి షెట్టికి మాత్రం 3 సినిమాలున్నాయి. ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేసుకోవాలి. అందుకే జులై రెండో
వారం వరకు ఆగాల్సి వస్తోంది.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ వర్క్ ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై
శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి వస్తుందట.

First Published:  23 Jun 2021 12:44 PM IST
Next Story