జగన్ సర్కార్ సూపర్.. చిరంజీవి ప్రశంసలు..!
ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఏపీలో భారీగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకేరోజు దాదాపు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్న విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి కూడా స్పందించారు. ‘కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కృషి ఎంతో గొప్పగా ఉంది. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందుకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక అభినందనలు’ అంటూ […]
ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఏపీలో భారీగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకేరోజు దాదాపు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్న విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి కూడా స్పందించారు.
‘కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కృషి ఎంతో గొప్పగా ఉంది. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందుకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక అభినందనలు’ అంటూ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
ఒకేరోజు 13.72 లక్షల మందికి కరోనా టీకాలు వేయడంతో ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి 8 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయించాలని ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా భారీగా వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఏపీలో వ్యాక్సినేషన్ సరిగ్గా జరగడం లేదని.. వ్యాక్సిన్ కొనుగోలు చేయడంలో జగన్ సర్కారు విఫలమైందని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఓ వర్గం మీడియా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పించాయి. తాజాగా జగన్ సర్కార్ ఒకేరోజు 13.72 లక్షల మందికి టీకాలు వేసి విమర్శలకు సమాధానం చెప్పింది. మరోవైపు ఏపీలో రోజురోజుకూ కరోనా కూడా అదుపులోకి వస్తున్నది. అంతేకాక కరోనా బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తున్నది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్నారు.