ఆర్ఎన్ఏ టీకాల రూటే వేరు!
ప్రస్తుతం ప్రపంచంలో కోవిడ్ కోసం రకరకాల వ్యాక్సిన్లు అందుబాటు లో ఉన్నాయి. మనదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్–వీ టీకాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. త్వరలో ఫైజర్,మోడెర్నా టీకాలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ రెండు టీకాలు మిగిలిన టీకాల కంటే కాస్త భిన్నమైనవని నిపుణులు చెప్తున్నారు. అదెలాగంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న కోవిడ్ టీకాలను రెండు భాగాలుగా విభజించొచ్చు. ఒకటి సాంప్రదాయ టీకాలు. రెండు కొత్త టెక్నాలజీతో రూపొందిన ఆర్ఎన్ఏ టీకాలు. వీటి మధ్య తేడా ఏంటంటే.. సాంప్రదాయ […]
ప్రస్తుతం ప్రపంచంలో కోవిడ్ కోసం రకరకాల వ్యాక్సిన్లు అందుబాటు లో ఉన్నాయి. మనదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్–వీ టీకాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. త్వరలో ఫైజర్,మోడెర్నా టీకాలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ రెండు టీకాలు మిగిలిన టీకాల కంటే కాస్త భిన్నమైనవని నిపుణులు చెప్తున్నారు. అదెలాగంటే..
ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న కోవిడ్ టీకాలను రెండు భాగాలుగా విభజించొచ్చు. ఒకటి సాంప్రదాయ టీకాలు. రెండు కొత్త టెక్నాలజీతో రూపొందిన ఆర్ఎన్ఏ టీకాలు. వీటి మధ్య తేడా ఏంటంటే..
సాంప్రదాయ టీకాలను వేరొక వైరస్ ను ఉపయోగించి తయారు చేస్తారు. ఉదాహరణకు కోవిడ్‌కు ఉపయోగిస్తున్న కోవిషీల్డ్, స్పుత్నిక్– వీ టీకాలను చింపాంజీల్లోని అడినో వైరస్ ద్వారా తయారు చేశారు. ఆ వైరస్ జన్యుక్రమంలోకి సార్స్ కోవ్–2 వైరస్ స్పైక్ ను చేర్చడం ద్వారా టీకా తయారు చేశారు. అలాగే కోవాగ్జిన్‌ను నిర్వీర్యం చేసిన వైరస్‌తో తయారు చేశారు. ఈ తరహా టీకాలు వైరస్ విడిభాగాలను గుర్తించి వాటిపై దాడి చేసేందుకు యాంటీబాడీలను తయారు చేస్తాయి. ఇదీ సాంప్రదాయ టీకా ఫార్ములా.
అయితే కొత్తగా రూపొందిస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు వేరే ఫార్ములాతో పనిచేస్తాయి. ఇవి వ్యాధి నిరోధక ప్రొటీన్లను ఎలా ఉత్పత్తి చేసుకోవాలో శరీరానికి నేర్పుతాయి. ఫైజర్, మోడెర్నా, బయోఎన్‌టెక్, క్యూర్‌వ్యాక్‌లు ఈ రకమైన టీకాలను డెవలప్ చేస్తున్నాయి. ఈ టీకాలు వైరస్ ఆర్ఎన్ఏ ను స్టడీ చేసి అలాంటి వైరస్ లు బాడీలోకి ఎంటర్ అవ్వగానే వెంటనే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రారంభించేలా శరీరానికి సిగ్నల్ ఇస్తాయి.
ఈ కొత్త ఆర్ఎన్ఏ టెక్నాలజీతో కోవిడ్ ఒక్కటే కాదు రకరకాల వ్యాధులను తగ్గించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ తరహా టెక్నాలజీలో మరిన్ని పరిశోధనలు జరుగుతాయని, దీంతో క్యాన్సర్ సహా అనేక ఇతర వ్యాధులకు చికిత్స కల్పించడం ఈజీ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.