చిరు టైటిల్ తో వస్తున్న కార్తికేయ
హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు కార్తికేయ. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ‘రాజావిక్రమార్క’ టైటిల్ ఖరారు చేశారు. అలాగే, సినిమాలో […]
హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు కార్తికేయ. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రానికి ‘రాజావిక్రమార్క’ టైటిల్ ఖరారు చేశారు. అలాగే, సినిమాలో హీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయింది. త్వరలోనే మిగతా భాగం పూర్తి చేసి, ఆ తర్వాత విడుదల వివరాలు వెల్లడిస్తారు. సినిమాలో కొత్తగా ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తాడు. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమౌతోంది.