మాస్ట్రో రిలీజ్ పై క్లారిటీ వచ్చింది
నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాపై నిన్నటివరకు ఓ ప్రచారం బాగా నడిచింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ చాలామంది కథనాలిచ్చారు. అందులో కొంత నిజం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది. మాస్ట్రో సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే లాక్ డౌన్ పడింది. మళ్లీ థియేటర్ల వ్యవస్థ ఎప్పుడు గాడిలో పడుతుందో తెలీదు. అందుకే దాదాపు నెల కిందటే మాస్ట్రో సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద ఇచ్చేశారు. ఈ […]
నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాపై నిన్నటివరకు ఓ ప్రచారం బాగా నడిచింది. ఈ సినిమాను
నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ చాలామంది కథనాలిచ్చారు. అందులో కొంత నిజం కూడా ఉంది.
కాకపోతే ఇప్పుడు ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది.
మాస్ట్రో సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే లాక్ డౌన్ పడింది. మళ్లీ థియేటర్ల వ్యవస్థ ఎప్పుడు గాడిలో
పడుతుందో తెలీదు. అందుకే దాదాపు నెల కిందటే మాస్ట్రో సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద
ఇచ్చేశారు. ఈ మేరకు భారీ డీల్ కూడా సెట్ అయింది
అయితే ఫైనల్ షెడ్యూల్ పూర్తయ్యే టైమ్ కు థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో మాస్ట్రోను ముందుగా
థియేటర్లలోనే రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తోంది యూనిట్. గతంలో నాగార్జున నటించిన వైల్డ్
డాగ్ సినిమాకు కూడా ఇలానే జరిగింది.