Telugu Global
Cinema & Entertainment

నితిన్ సినిమా షూటింగ్ పూర్తయింది

లాక్ డౌన్ ఓవైపు నడుస్తుండగానే, మరోవైపు తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు నితిన్. అదే మ్యాస్ట్రో మూవీ. ఇంత తొందరగా నితిన్ ఎందుకు సెట్స్ పైకి వచ్చాడనే విషయం ఈరోజు అందరికీ అర్థమైంది. మ్యాస్ట్రోకు సంబంధించి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్. ఆ ప్యాచ్ వర్క్ ను ఇవాళ్టితో పూర్తిచేసి, సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. అలా జస్ట్ 3 రోజుల ఫైనల్ షెడ్యూల్ తో మ్యాస్ట్రో షూటింగ్ పూర్తిచేశాడు నాని. మరో 20 […]

నితిన్ సినిమా షూటింగ్ పూర్తయింది
X

లాక్ డౌన్ ఓవైపు నడుస్తుండగానే, మరోవైపు తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు నితిన్. అదే మ్యాస్ట్రో
మూవీ. ఇంత తొందరగా నితిన్ ఎందుకు సెట్స్ పైకి వచ్చాడనే విషయం ఈరోజు అందరికీ అర్థమైంది.
మ్యాస్ట్రోకు సంబంధించి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్. ఆ ప్యాచ్ వర్క్ ను ఇవాళ్టితో పూర్తిచేసి,
సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.

అలా జస్ట్ 3 రోజుల ఫైనల్ షెడ్యూల్ తో మ్యాస్ట్రో షూటింగ్ పూర్తిచేశాడు నాని. మరో 20 రోజుల్లో పోస్ట్
ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి, ఫస్ట్ కాపీ రెడీ చేయబోతున్నాడు. మరోవైపు ఈ సినిమాను నేరుగా
ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నితిన్ ఆఘమేఘాల మీద ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి
కూడా ఇదే కారణం అనే ప్రచారం కూడా ఉంది.

అయితే ఈ ప్రచారంపై నితిన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు మ్యాస్ట్రోను ఓటీటీకి ఇవ్వాలా వద్దా
అనే నిర్ణయం కూడా నితినే తీసుకోవాలి. ఎందుకంటే, ఈ సినిమాకు నిర్మాత కూడా ఇతడే. హిందీలో
సూపర్ హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా వస్తోంది మ్యాస్ట్రో. మేర్లపాక గాంధీ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్న లేడీ విలన్ గా కనిపించబోతోంది.

First Published:  20 Jun 2021 2:02 PM IST
Next Story