Telugu Global
National

పిల్లల్లో తగ్గిపోతున్న సహజ రోగ నిరోధక శక్తి..

ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఒక్కొకరిలో ఇది ఒక్కో రకంగా ఉంటుంది. వర్షంలో తడిస్తేనే.. తుమ్ములు, జలుబు, జ్వరంతో మూల కూర్చునేవారు కొందరయితే.. అసలు జ్వరం, జలుబు దరిచేరకుండా గట్టిగా రాయిలాగా ఉండిపోతారు కొందరు. పెద్దవారితో పోల్చి చూస్తే పిల్లల్లో ఈ రోగనిరోధక శక్తి ఇంకాస్త ఎక్కువ. అందుకే కరోనా వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని చెబుతుంటారు వైద్య నిపుణులు. అయితే ఇప్పుడీ సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని మనమే చేతులారా నాశనం […]

పిల్లల్లో తగ్గిపోతున్న సహజ రోగ నిరోధక శక్తి..
X

ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఒక్కొకరిలో ఇది ఒక్కో రకంగా ఉంటుంది. వర్షంలో తడిస్తేనే.. తుమ్ములు, జలుబు, జ్వరంతో మూల కూర్చునేవారు కొందరయితే.. అసలు జ్వరం, జలుబు దరిచేరకుండా గట్టిగా రాయిలాగా ఉండిపోతారు కొందరు. పెద్దవారితో పోల్చి చూస్తే పిల్లల్లో ఈ రోగనిరోధక శక్తి ఇంకాస్త ఎక్కువ. అందుకే కరోనా వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని చెబుతుంటారు వైద్య నిపుణులు. అయితే ఇప్పుడీ సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని మనమే చేతులారా నాశనం చేస్తున్నామని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు మాస్క్ లు వేసి, ఎవరితో కలవనీయకుండా భౌతిక దూరం అలవాటు చేసి వారి రోగనిరోధక శక్తిని తగ్గించేస్తున్నామని అంటున్నారు.

కరోనా నివారణకు ప్రధాన అస్త్రాలుగా మనం ఉపయోగిస్తున్న మాస్కులు, భౌతిక దూరం పిల్లల పాలిట శాపంగా మారుతోందని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. స్కూళ్లు కూడా లేకపోవడంతో పిల్లలు పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. దీంతో తోటి పిల్లలతో ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ కారణంగా వారికి వైరస్, బ్యాక్టీరియాతో సోకే వ్యాధులు గణనీయంగా తగ్గిపోయాయి. అంటే సహజంగా పిల్లల్లో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థకు పనిలేకుండా పోయిందనమాట. దీంతో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయిన తర్వాత వచ్చే సహజమైన రోగకారకాలను పిల్లలు ఎదుర్కోలేరని బ్రిటన్ వైద్య నిపుణల అధ్యయనం తెలిపింది.

చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. అయితే ఇది ప్రాణాంతకమేమీ కాదు. ఈ వైరస్ ఒకసారి సోకితే.. పిల్లల్లో దానికి సంబంధించిన యాంటీబాడీలు పెరుగుతాయి. ఆ తర్వాత RSV ఎప్పుడు అటాక్ చేసినా, పిల్లల్లో ఉండే యాంటీబాడీలు దాన్ని అడ్డుకుంటాయి. ఆ రకమైన ఇమ్యూనిటీ పవర్ పిల్లల్లో పెరుగుతుంది. పిల్లలు స్కూల్ కి వెళ్లడం, సమూహాలుగా ఆడుకోవడం వంటివి చేస్తున్నప్పుడే ఈ RSV ఒకరినుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది. ఇప్పుడు కరోనా కారణంగా పిల్లలు ఇంటికే పరిమితం కావడం, మాస్క్ లు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడంతో ఈ వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. కరోనాకంటే ముందు బ్రిటన్ లో ప్రతి ఏటా 30వేలమంది చిన్నారులు ఈ RSV బారినపడేవారు. కానీ ఇప్పుడు కనీసం వెయ్యి కేసులు కూడా లేవట. అందే దీనిబారినుంచి పిల్లలు పూర్తిగా తప్పించుకున్నారు. ఒకరంగా ఇది సంతోషించదగ్గ పరిణామమే అయినా, కరోనా కష్టకాలం తొలగిపోయి, సాధారణ జీవనం మొదలయ్యాక పిల్లల్లో సహజసిద్ధమైన వ్యాధినిరోధక శక్తి ఉండదనేది బ్రిటన్ శాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే కరోనా కాలం తర్వాత పిల్లలు మరీ సుకుమారంగా తయారవుతారట. ఒకరకంగా మాస్క్ లు వేసి, ఎవరితో కలవనీయకుండా చేసి పిల్లలలో పెరగాల్సిన సహజసిద్ధమైన వ్యాధినిరోధకతను మనమే అడ్డుకుంటున్నామని అంటున్నారు. కరోనా ప్రపంచం నుంచి పూర్తిగా తొలగిపోతే.. ఆ తర్వాత దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఒక్కొక్కటే బయటపడతాయని హెచ్చరిస్తున్నారు.

First Published:  20 Jun 2021 12:30 AM GMT
Next Story