ఎఫ్3 మూవీ షూటింగ్ కు అంతా రెడీ
లాక్ డౌన్ కారణంగా ఎఫ్3 సినిమా షూట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తయింది. మరో 40శాతం పెండింగ్ ఉంది. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తే అప్పుడు ఏకథాటిగా షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఎఫ్3 షూట్ కంప్లీట్ చేస్తానని అనీల్ రావిపూడి ఇదివరకే ప్రకటించాడు. అయితే షూటింగ్ కు సంబంధించి వెంకటేష్ ఓ కండిషన్ పెట్టాడు. యూనిట్ లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే తను సెట్స్ పైకి […]
లాక్ డౌన్ కారణంగా ఎఫ్3 సినిమా షూట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి 60
శాతం షూటింగ్ పూర్తయింది. మరో 40శాతం పెండింగ్ ఉంది. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తే అప్పుడు
ఏకథాటిగా షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఎఫ్3 షూట్ కంప్లీట్ చేస్తానని అనీల్ రావిపూడి ఇదివరకే ప్రకటించాడు.
అయితే షూటింగ్ కు సంబంధించి వెంకటేష్ ఓ కండిషన్ పెట్టాడు. యూనిట్ లో అందరికీ వ్యాక్సినేషన్
పూర్తయిన తర్వాతే తను సెట్స్ పైకి వస్తానని, లేదంటే షూటింగ్ కు రానని తెగేసి చెప్పేశాడు. ఇలాంటి
విషయాల్లో వెంకీ చాలా నిక్కచ్చిగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే.
అందుకే నిర్మాత దిల్ రాజు హుటాహుటిన తన యూనిట్ సభ్యులందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్
ఏర్పాటుచేశాడు. ఏకంగా 200 మందికి కరోనా టీకా వేయించాడు. మరికొంతమంది చిరంజీవి ఆధ్వర్యంలో
నడుస్తున్న సీసీసీ ఛారిటీ కింద ఆల్రెడీ టీకా వేయించుకున్నారు. అలా యూనిట్ లో అందరికీ టీకాలు
వేయించిన దిల్ రాజు, త్వరలోనే ఎఫ్3ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.