Telugu Global
National

మోదీ ఉచిత టీకా పరమార్థమిదేనా..?

“దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వయోజనులందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇస్తాం, రాష్ట్రాలకు రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వమే టీకాలు సరఫరా చేస్తుంది.” ఇదీ ఈమధ్య కాలంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్ మెంట్. బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి, పెట్రోవాత కూడా టీకాలకోసమేననే కవరింగ్ లు కూడా మొదలయ్యాయి. నిజంగానే జనం ప్రజలందరికీ ఉచిత టీకా ఇస్తారని అనుకున్నారు. కానీ ఆ ఉచితంలో అనుచితం రానురాను సామాన్యులకు బోధపడుతోంది. ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు రంగంలో టీకా […]

మోదీ ఉచిత టీకా పరమార్థమిదేనా..?
X

“దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వయోజనులందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇస్తాం, రాష్ట్రాలకు రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వమే టీకాలు సరఫరా చేస్తుంది.” ఇదీ ఈమధ్య కాలంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్ మెంట్. బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి, పెట్రోవాత కూడా టీకాలకోసమేననే కవరింగ్ లు కూడా మొదలయ్యాయి. నిజంగానే జనం ప్రజలందరికీ ఉచిత టీకా ఇస్తారని అనుకున్నారు. కానీ ఆ ఉచితంలో అనుచితం రానురాను సామాన్యులకు బోధపడుతోంది. ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు రంగంలో టీకా లభ్యత ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దాదాపుగా మధ్యతరగతి ప్రజలందరూ టీకాలకోసం ప్రైవేటు ఆస్పత్రులకే పరుగులు తీస్తున్నారు. ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద సర్కారు టీకా పంపిణీ కార్యక్రమాలకంటే.. ప్రైవేటు ఆస్పత్రుల టీకా డ్రైవ్ లే భారీగా సక్సెస్ అవుతున్నాయి.

రెండోడోసుతో డీలా..
తొలిడోసు సకాలంలో ఇచ్చినా, రెండో డోసుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడిగాపులు పడాల్సిన సందర్భం. సమయం మించిపోతున్నా రెండోడోసువారికి సకాలంలో టీకాలు ఇవ్వడంలేదు. దీంతో చాలామంది ప్రైవేటు బాటపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా రెండోడోసు విషయంలో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారనే అపవాదు కూడా ప్రభుత్వాలపై ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ముందు జాగ్రత్తగా ప్రైవేటు ఆస్పత్రులను ఎంపిక చేసుకుంటున్నారు. తొలిడోసు వేసుకున్నాక, రెండోడోసు సమయాన్ని గుర్తు చేసి మరీ వేస్తారు కాబట్టి అక్కడికే వెళ్తున్నారు.

థర్డ్ వేవ్ హడావిడి ఎక్కువైంది..?
అప్రమత్తత అవసరమే కానీ, థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వాల హడావిడి మాత్రం ఎక్కువైంది. వచ్చేస్తోందొచ్చేస్తోంది థర్డ్ వేవ్, అందరూ టీకాలు వేయించుకోవడమే దాన్ని ఎదుర్కునే ఏకైక మార్గం అనే ప్రచారం బాగా ఎక్కువైంది. దీంతో ప్రజల్లో టీకా వేయించుకోవాలనే ఆదుర్దా మొదలై.. చాలామంది అందుబాటులో ఉన్న ప్రైవేటు బాట పడుతున్నారు. రేషన్ సరకుల్లాగా పేద, ధనిక తేడా లేకుండా ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇస్తామన్న కేంద్రం ఇప్పుడు వ్యూహాత్మకంగానే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి ఉచిత హామీనుంచి తాను తప్పుకుంటోంది.

రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలో టీకా లభ్యత మరింతగా తగ్గిపోతుందని తెలుస్తోంది. అదే సమయంలో ప్రైవేటు రంగంలో టీకాల లభ్యత పెరిగిపోవడంతో మధ్యతరగతి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు టీకాకోసం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభుత్వ లెక్కలన్నీ ఏరోజుకారోజు వేసిన డోసుల సంఖ్యను చూపుతున్నాయే కానీ, ప్రభుత్వం ఇంతమందికి టీకా ఇచ్చింది, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంతమందికి టీకా వేశారనే వివరం అందులో లేదు. ఆ విధంగా టీకా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మహబాగా తప్పించుకుంటున్నారు మోదీ.

First Published:  20 Jun 2021 1:45 AM IST
Next Story