Telugu Global
NEWS

భవిష్యత్తులో తిరుమలపై అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే..

తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో కొండపైకి కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడుపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొండపై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించామని గుర్తు చేశారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు – సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఏర్పాట్లు – వారంలోగా తిరుమల […]

భవిష్యత్తులో తిరుమలపై అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే..
X

తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో కొండపైకి కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడుపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొండపై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించామని గుర్తు చేశారు.

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
– సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఏర్పాట్లు
– వారంలోగా తిరుమల కొండపై అనధికారిక దుకాణాల తొలగింపు
– ఏపీలోని 13 ప్రాంతాల్లో నూతనంగా టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణం
– ఏపీ, తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 500ఆలయాలను ఏడాదిలోగా నిర్మించేందుకు నిర్ణయం
– ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం
– తిరుపతిలోని గరుడవారధిని అలిపిరి వరకు పొడిగింపు
– కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెంపు
– వరహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు
– ఇకపై స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేద్యం

హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతున్న వివాదంపై కూడా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంజనాద్రినే హనుమంతుడి జన్మస్థలం అని నమ్ముతున్నామని, దీనిపై ఎలాంటి వివాదాలు వద్దని అన్నారు. జమ్మూలో 62 ఎకరాల్లో ఆల‌యాన్ని నిర్మిస్తున్నామని, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామ‌ని చెప్పారు. త్వరలో ముంబై, వారణాసిలో కూడా టీటీడీ ఆలయాల నిర్మాణం చేపడతామ‌ని అన్నారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని వెల్ల‌డించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని, దేశవ్యాప్తంగా ఇలా 500 ఆలయాల నిర్మాణం చేపడుతున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

First Published:  19 Jun 2021 1:57 PM IST
Next Story