అనసూయ.. అవమానం.. డ్రామా
యాంకర్ అనసూయకు ఘోర అవమానం జరిగింది. అది కూడా తను ఎంతగానో ఇష్టపడే జబర్దస్ట్ సెట్స్ లో ఈ అవమానం జరగడం బాధాకరం. గెస్ట్ గా వచ్చిన ఓ వ్యక్తి అనసూయ పాలిట ఘోస్ట్ గా మారాడు. సూటిపోటి మాటలతో ఆమెను తెగ ఇబ్బంది పెట్టాడు. చివరికి ఆ కామెంట్స్ భరించలేక అనసూయ స్టేజ్ దిగి వెళ్లిపోయింది. జబర్దస్త్ కొత్త స్కిట్ కోసం యూట్యూబ్ యాంకర్ శివను రంగంలోకి దించాడు హైపర్ ఆది. ఇద్దరూ కలిసి స్కిట్ […]
యాంకర్ అనసూయకు ఘోర అవమానం జరిగింది. అది కూడా తను ఎంతగానో ఇష్టపడే జబర్దస్ట్ సెట్స్
లో ఈ అవమానం జరగడం బాధాకరం. గెస్ట్ గా వచ్చిన ఓ వ్యక్తి అనసూయ పాలిట ఘోస్ట్ గా మారాడు.
సూటిపోటి మాటలతో ఆమెను తెగ ఇబ్బంది పెట్టాడు. చివరికి ఆ కామెంట్స్ భరించలేక అనసూయ స్టేజ్
దిగి వెళ్లిపోయింది.
జబర్దస్త్ కొత్త స్కిట్ కోసం యూట్యూబ్ యాంకర్ శివను రంగంలోకి దించాడు హైపర్ ఆది. ఇద్దరూ కలిసి
స్కిట్ చేశారు. అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో ”మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను” అంటాడు
శివ. ఎందుకు చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తారని స్టేజ్ పైనే అనసూయను అడిగేశాడు. అది తన పర్సనల్
అంటుంది అనసూయ.
పర్సనల్ అన్నప్పుడు ఇంట్లో వేస్కోవాలి, ఇలా స్టేజ్ పై కాదంటాడు శివ. దీంతో అనసూయ హర్ట్
అవుతుంది. స్టేజ్ దిగి వెళ్లిపోతుంది. ఆమె వెంట హైపర్ ఆది వెళ్లి సముదాయిస్తాడు. ఈ హఠాత్
పరిణామానికి గెస్టులుగా ఉన్న రోజా, మనో కూడా షాక్ అవుతారు. ఈ డ్రామా మొత్తాన్ని వచ్చే గురువారం
జబర్దస్త్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.