సోనూ సూద్ కు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఎక్కడివి? హైకోర్టు ఆగ్రహం..!
కరోనా టైంలో సోనూ సూద్ .. పేద ప్రజలకు దేవుడిలా మారిపోయారు. అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు పంపిణీ చేశారు. రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఆర్థిక సాయం కూడా చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాలకే ఆక్సిజన్ దొరకని పరస్థితుల్లో సోనూ సూద్ కు ఎలా దొరికిందంటూ కొందరు విమర్శలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడితే సోనూ సూద్ దగ్గర మాత్రం ఆ ఇంజక్షన్లు ఎలా […]
కరోనా టైంలో సోనూ సూద్ .. పేద ప్రజలకు దేవుడిలా మారిపోయారు. అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు పంపిణీ చేశారు. రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఆర్థిక సాయం కూడా చేశారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వాలకే ఆక్సిజన్ దొరకని పరస్థితుల్లో సోనూ సూద్ కు ఎలా దొరికిందంటూ కొందరు విమర్శలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడితే సోనూ సూద్ దగ్గర మాత్రం ఆ ఇంజక్షన్లు ఎలా అందుబాటులో ఉన్నాయని పలువురు ప్రశ్నించారు. అ విషయంపై ప్రస్తుతం ముంబై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ సిద్దిఖీ, నటుడు సోనూ సూద్ రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సోనూ సూద్ ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను పంపిణీ చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దిఖీ సైతం బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు పంపిణీ చేశారు.
సోనూ సూద్ లైఫ్ లైన్ మెడికేర్ ఆసుపత్రిలోని దుకాణాల ద్వారా రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు పొందారని విచారణలో తేలింది. భివాండీలోని సిప్లా ఫార్మా సంస్థ నుంచి వచ్చాయని, ఇవి ప్రభుత్వ కేటాయింపుల్లోనివి కావని, దీనిపై విచారణ పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. సిద్ధిఖీ తన దగ్గరికి వచ్చిన వారికి నేరుగా రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వకుండా వారిని బీడీఆర్ ఫౌండేషన్ కు మళ్లించారని తేలింది. దీంతో ఈ విషయంపై ముంబై హైకోర్టు సీరియస్గా స్పందించింది.
ఇంజక్షన్లు పంపిణీ చేసే క్రమంలో ఔషధ పంపిణీ చట్టబద్దమో కాదో తెలుసుకోవద్దా? ఔషధాలకు సంబంధించి ఓ చట్టం, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరికి వారు ఔషధాల పంపిణీని తమ ఆధీనంలోకి తీసుకొని పంపిణీ చేస్తే ఎలా? అంటూ హైకోర్టు ఫైర్ అయ్యింది.