Telugu Global
Cinema & Entertainment

మళ్లీ ప్రేమలో పడిన మాజీ హీరోయిన్

మాజీ హీరోయిన్ మినీషా లాంబా మరోసారి లవ్ లో పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎనౌన్స్ చేసింది. మూడేళ్లుగా సింగిల్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన లవ్ రిలేషన్ షిప్ బాగుందని అంటోంది. “నేను ఇప్పుడు లవ్ లో పడ్డాను. ఓ లవ్లీ పర్సన్ నా జీవితంలో ఉన్నాడు. జీవితం ఇప్పుడు బాగుంది. నా రిలేషన్ షిప్ బాగా నడుస్తోంది. రిలేషన్ షిప్ లేదా మ్యారీడ్ లైఫ్ ముగిసిపోయిందంటే దానర్థం జీవితమే ముగిసిపోయిందని […]

మళ్లీ ప్రేమలో పడిన మాజీ హీరోయిన్
X

మాజీ హీరోయిన్ మినీషా లాంబా మరోసారి లవ్ లో పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎనౌన్స్
చేసింది. మూడేళ్లుగా సింగిల్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన లవ్ రిలేషన్ షిప్ బాగుందని
అంటోంది.

“నేను ఇప్పుడు లవ్ లో పడ్డాను. ఓ లవ్లీ పర్సన్ నా జీవితంలో ఉన్నాడు. జీవితం ఇప్పుడు బాగుంది. నా
రిలేషన్ షిప్ బాగా నడుస్తోంది. రిలేషన్ షిప్ లేదా మ్యారీడ్ లైఫ్ ముగిసిపోయిందంటే దానర్థం జీవితమే
ముగిసిపోయిందని కాదు. మళ్లీ ప్రేమలో పడడానికి ఇంకో అవకాశం దక్కినట్టు. పాత జ్ఞాపకాల్ని
మరిచిపోవాలి, మరోసారి ప్రేమలో పడాలి.”

ఇలా తను ప్రేమలో పడిన విషయాన్ని కన్ ఫర్మ్ చేసింది మినీషా లాంబా. 2015లో రియాన్ థామ్ అనే నైట్ క్లబ్ ఓనర్ తో లవ్ లో పడింది మినీషా లాంబా. 8 నెలలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు.

తను రియాన్ తో కలిసి ఉండడం లేదంటూ 2018లోనే ప్రకటించింది మినీషా లాంబా. అలా మూడేళ్లుగా
ఒంటరిగా ఉంటున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి ప్రేమలో పడింది. అయితే ఈసారి ఆ వ్యక్తి ఎవరనే
విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

First Published:  17 Jun 2021 2:32 PM IST
Next Story