Telugu Global
National

టీకా వేసుకుంటే అయస్కాంతంలా మారిపోతారా..?

కరోనా టీకా వేసుకుంటే జ్వరం, ఒళ్లు నెప్పులు అనేవి సహజంగా కనిపించే రియాక్షన్స్. కొంతమందిలో ఇవి కూడా ఉండకపోవచ్చు. అయితే వ్యాక్సిన్ వచ్చిన తొలినాళ్లలో కొంతమందికి ప్రాణాపాయం కూడా కలిగిందనే వార్తలొచ్చాయి. పాత రోగాలున్నావారే ఇబ్బంది పడ్డారని, వ్యాక్సిన్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు క్లారిటీ ఇవ్వడంతో ఇటీవల ఇలాంటి పుకార్లకు చెక్ పడింది. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రచారం మొదలైంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారు శరీరం అయస్కాంతంలా మారిపోతోందని, ఇనుప వస్తువుల్ని ఆకర్షిస్తోందని […]

టీకా వేసుకుంటే అయస్కాంతంలా మారిపోతారా..?
X

కరోనా టీకా వేసుకుంటే జ్వరం, ఒళ్లు నెప్పులు అనేవి సహజంగా కనిపించే రియాక్షన్స్. కొంతమందిలో ఇవి కూడా ఉండకపోవచ్చు. అయితే వ్యాక్సిన్ వచ్చిన తొలినాళ్లలో కొంతమందికి ప్రాణాపాయం కూడా కలిగిందనే వార్తలొచ్చాయి. పాత రోగాలున్నావారే ఇబ్బంది పడ్డారని, వ్యాక్సిన్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు క్లారిటీ ఇవ్వడంతో ఇటీవల ఇలాంటి పుకార్లకు చెక్ పడింది. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రచారం మొదలైంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారు శరీరం అయస్కాంతంలా మారిపోతోందని, ఇనుప వస్తువుల్ని ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇలా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టడంతో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.

మ్యాగ్నెటిక్ మ్యాన్..
మహారాష్ట్రలోని నాసిక్ లో 71ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన శరీరం అయస్కాంతంలా మారిందని చెబుతున్నాడు. ఇటీవలే వ్యాక్సిన్ రెండోడోసు తీసుకుని ఇంటికొచ్చిన ఆయన, తన శరీరం ఇనుప వస్తువుల్ని ఆకర్షించడం గమనించాడు. దీంతో అతను ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది.

అయస్కాంతంగా మారిన అనిమా..
తాజాగా బెంగాల్‌ కు చెందిన అనిమా నాస్కర్‌ అనే 66 ఏళ్ల మహిళ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న తర్వాత తనకీ అయస్కాంత శక్తి లభించిందని చెబుతోంది అనిమా. అయితే దీనికీ వ్యాక్సినేషన్ కి సంబంధం ఉందా లేదా అనే అనుమానం మాత్రం ఇంకా తొలగిపోలేదని అంటోంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు గమనించి ఆశ్చర్యపోయానని చెబుతోంది అనిమా. ఆమె కొడుకు.. తన తల్లికి అయస్కాంత లక్షణాలున్నాయంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

అసలేంటి సంగతి..?
వ్యాక్సిన్ వేసుకుంటే శరీరం అయస్కాంతంలా మారిపోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో చాలామందిలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) సంస్థ స్పందించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి శరీరం అయస్కాంత పదార్థంగా మారదని తెలిపింది. టీకాల తయారీలో ఇనుము, నికెల్, కోబాల్ట్, లిథియం, వంటి మిశ్రమాలు వాడరని చెప్పింది. కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే సరైన మార్గమని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

First Published:  16 Jun 2021 2:56 AM IST
Next Story