Telugu Global
International

వ్యాక్సినేషన్ లో మనమెక్కడ?

కరోనా వైరస్ పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకూ సుమారు 177మిలియన్ల మంది కోవిడ్ బారిన పడ్డారు. అలాగే 3.8 మిలియన్ల మంది మరణించారు. ఇప్పటికీ కోవిడ్ ముప్పు తప్పలేదు. వేవ్స్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తునే ఉంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొంత తేడా వచ్చిందనే చెప్పాలి. అసలు వ్యాక్సినేషన్ ఎంత వరకు కోవిడ్ వ్యాప్తి ని ఆపగలుగుతుంది. మనదేశం కోలుకోడానికి వ్యాక్సినేషన్ ఎంతమేరకు సాయపడగలదు? లెక్కలు ఏం చెప్తున్నాయి? గ్లోబల్ వ్యాక్సినేషన్ డేటా లెక్కలను బట్టి […]

వ్యాక్సినేషన్ లో మనమెక్కడ?
X

కరోనా వైరస్ పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకూ సుమారు 177మిలియన్ల మంది కోవిడ్ బారిన పడ్డారు. అలాగే 3.8 మిలియన్ల మంది మరణించారు. ఇప్పటికీ కోవిడ్ ముప్పు తప్పలేదు. వేవ్స్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తునే ఉంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొంత తేడా వచ్చిందనే చెప్పాలి. అసలు వ్యాక్సినేషన్ ఎంత వరకు కోవిడ్ వ్యాప్తి ని ఆపగలుగుతుంది. మనదేశం కోలుకోడానికి వ్యాక్సినేషన్ ఎంతమేరకు సాయపడగలదు? లెక్కలు ఏం చెప్తున్నాయి?

గ్లోబల్ వ్యాక్సినేషన్ డేటా లెక్కలను బట్టి చూస్తే.. వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరిగిన దేశాలు కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నట్టే తెలుస్తోంది. దేశ జనాభాలో కనీసం పావు వంతు అంటే 25శాతం మందికి వ్యాక్సిన్స్ వేసిన దేశాలు డైలీ కోవిడ్ కేసులను బాగా తగ్గించగలిగాయి.

ప్రతి వంద మందిలో వ్యాక్సిన్స్ తీసుకున్న వారి శాతాన్ని తీసుకుంటే.. భారత్ కంటే ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిపిన దేశాలు చాలానే ఉన్నాయి. ఒక్క భారత్ మినహా అన్ని దేశాలు తమ జనాభాకు వ్యాక్సిన్స్ అందించే శాతాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ప్రపంచ దేశాల్లో సగానికి పైగా దేశాలు తమ జనాభాలో కనీసం 10 శాతం మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్స్ ఇవ్వగలిగాయి. కానీ భారత్ ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్స్ ఇచ్చింది 3.4 శాతం మందికి మాత్రమే. వ్యాక్సినేషన్ డేటాల్లో ప్రతి కేటగిరీలోనూ ఇండియా వెనుకబడే ఉంది. సరైన వసతులు ఉండని ఆఫ్రికా దేశాలు కూడా భారత్ కంటే ఎక్కువ శాతం వ్యాక్సిన్స్ అందించగలిగాయి.

ప్రతి వంద మందిలో కనీసం ఒక్కడోసు టీకా తీసుకున్న వారి సంఖ్య యూకేలో 60గా ఉంటే యూఎస్ లో 51 గాఉంది. భారత్ లో ఆ సంఖ్య 14 గాఉంది. అలాగే ప్రతి వందమందిలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య యూకెలో 43గా ఉంటే యూఎస్ లో 42 గాఉంది. భారత్ లో 3.4 గాఉంది. ఇకపోతే మరణాల రేటులో భారత్ ఇతర దేశాల కంటే ముందుంది.

లెక్కల ప్రకారం చూస్తే జపాన్ వ్యాక్సినేషన్ లో అందరికంటే వెనుకబడి ఉంది. అయితే కోవిడ్ పై జపాన్ పాటిస్తున్న ఫార్ములా వేరేగా ఉండడమే దీనికి కారణం. వాళ్లు కేసులను కట్టడి చేస్తూ.. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వృద్ధి చెందాకే ప్రజలకు అందిస్తామని చెప్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్ లో యూకే ప్రపంచ దేశాలన్నింటికంటే ముందుంది. తమ జనాభాలో 60 శాతం మందికి ఒక్కడోసు, 43శాతం మందికి రెండు డోసులు ఇవ్వగలిగింది. ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం వల్ల అక్కడ కేసుల సంఖ్య11శాతానికి తగ్గాయి.
ఈ డేటాను బట్టి చూస్తే కోవిడ్ మూడు, నాలుగు వేవ్స్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఏ స్థాయిలో జరగాలో, ఎంత స్పీడ్ గా జరగాలో తెలుస్తోంది. కానీ ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ అంతంత మాత్రంగానే ఉంది. మున్ముందు చర్యలు వేగవంతం అవుతాయో లేదో చూడాలి.

First Published:  16 Jun 2021 3:34 AM GMT
Next Story