టాలీవుడ్ లో రీ-రిలీజ్ సందడి
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్న వెంటనే వకీల్ సాబ్ సినిమాను మరోసారి విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే కేవలం వకీల్ సాబ్ సినిమా మాత్రమే కాదు, మరికొన్ని మూవీస్ కూడా ఇదే విధంగా రీ-రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లు తెరుచుకున్న తర్వాత వెంటనే సినిమాలు విడదలకావు. ఎందుకంటే, మారిన కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆడియన్స్ వెంటనే థియేటర్లకు రారు. కాబట్టి ఈ గ్యాప్ లో పాత సినిమాల్ని రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇప్పుడీ […]
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్న వెంటనే వకీల్ సాబ్ సినిమాను మరోసారి విడుదల
చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే కేవలం వకీల్ సాబ్ సినిమా
మాత్రమే కాదు, మరికొన్ని మూవీస్ కూడా ఇదే విధంగా రీ-రిలీజ్ కాబోతున్నాయి.
థియేటర్లు తెరుచుకున్న తర్వాత వెంటనే సినిమాలు విడదలకావు. ఎందుకంటే, మారిన కరోనా
పరిస్థితుల నేపథ్యంలో ఆడియన్స్ వెంటనే థియేటర్లకు రారు. కాబట్టి ఈ గ్యాప్ లో పాత సినిమాల్ని రిలీజ్
చేయాలనేది ప్లాన్. ఇప్పుడీ లిస్ట్ లోకి వకీల్ సాబ్ తో పాటు క్రాక్, జాతిరత్నాలు, ఉప్పెన సినిమాలు కూడా
చేరాయి.
ఏపీ, తెలంగాణలో థియేటర్లు తెరుచుకున్న తర్వాత మొదటి 2-3 వారాల పాటు ఈ పాత సినిమాల్నే
విడుదల చేయబోతున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ సినిమాలన్నీ నడుస్తాయి. ఆ తర్వాత 50 శాతం
ఆక్యుపెన్సీ నిబంధనను ఎత్తేస్తే సరి, లేదంటే అదే ఆక్యుపెన్సీతో కొత్త సినిమాల్ని విడుదల చేయడానికి
టాలీవుడ్ నిర్మాతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈలోగా ఈ పాత సినిమాల్ని చూడ్డానికి ఎంత మంది
వస్తున్నారనే అంశంపై నిర్మాతలు ఓ అంచనాకు రాబోతున్నారు.