Telugu Global
Cinema & Entertainment

రవితేజ సినిమా ఆగిపోలేదంట

లెక్కప్రకారం రవితేజ-త్రినాధరావు నక్కిన సినిమాను ప్రకటించాలి. కానీ ఊహించని విధంగా ఆ సినిమాను పక్కనపెట్టి ఓ కొత్త దర్శకుడి మూవీని ప్రకటించాడు రవితేజ. దీంతో నక్కిన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. అక్కడితో ఆగలేదు ప్రచారం. అదే కథతో త్రినాధరావు నక్కిన నేరుగా వెళ్లి వరుణ్ తేజ్ ను కలిసి ఓకే చేయించుకున్నాడనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. రవితేజ-త్రినాధరావు నక్కిన సినిమా ఉంటుందట. వరుణ్ తేజ్ కు నక్కిన చెప్పిన […]

రవితేజ సినిమా ఆగిపోలేదంట
X

లెక్కప్రకారం రవితేజ-త్రినాధరావు నక్కిన సినిమాను ప్రకటించాలి. కానీ ఊహించని విధంగా ఆ సినిమాను
పక్కనపెట్టి ఓ కొత్త దర్శకుడి మూవీని ప్రకటించాడు రవితేజ. దీంతో నక్కిన సినిమా ఆగిపోయిందంటూ
ప్రచారం జరిగింది. అక్కడితో ఆగలేదు ప్రచారం. అదే కథతో త్రినాధరావు నక్కిన నేరుగా వెళ్లి వరుణ్ తేజ్
ను కలిసి ఓకే చేయించుకున్నాడనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

కానీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. రవితేజ-త్రినాధరావు నక్కిన సినిమా ఉంటుందట. వరుణ్ తేజ్ కు
నక్కిన చెప్పిన కథ వేరే అంటున్నారు. ఈ మేరకు పీపుల్ మీడియా బ్యానర్ నుంచి లీకులొచ్చాయి.
త్వరలోనే తమ బ్యానర్ పై రవితేజ-నక్కిన కాంబోలో సినిమా ప్రకటన ఉంటుందంటున్నారు ఆ ప్రొడక్షన్
కంపెనీకి చెందిన జనాలు.

కథ కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ.. రెమ్యూనరేషన్ పక్కాగా ఉంటే కాల్షీట్లు ఇస్తాడు రవితేజ. ఇండస్ట్రీలో
ఇది ఓపెన్ సీక్రెట్. ఈ పారితోషికం లెక్కల్లోనే తేడాలొచ్చి రవితేజ సినిమాను పక్కనపెట్టినట్టు
చెబుతున్నారు. మొత్తానికి ఆ లెక్కలన్నీ ఇప్పుడు సర్దుకున్నట్టున్నాయి. సినిమా ప్రకటన రావడమే
ఆలస్యం.

First Published:  16 Jun 2021 3:20 PM IST
Next Story