Telugu Global
National

బాబాయ్​ వర్సెస్​ అబ్బాయ్​.. లోక్​జనశక్తిపార్టీలో ఎత్తులు, పై ఎత్తులు..!

ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పెత్తనాలు సహజమే. అందుకు ఈ దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీని తమ గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు కుటుంబరాజకీయాలు జోరుగా జరగుతుంటాయి. తెలుగు నాట తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుటుంబ రాజకీయాలు జరిగి.. చివరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతికి వెళ్లింది. ఇక తమిళనాడులోనూ ఎన్నో గొడవలు, ఎత్తులు పై ఎత్తులు జరిగి.. ప్రస్తుతం స్టాలిన్​ డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక యూపీలోని సమాజ్​వాద్​పార్టీలోనూ కుటుంబ పెత్తనం చూశాం.. ప్రస్తుతం బీహార్​లోని లోక్​జనశక్తి […]

బాబాయ్​ వర్సెస్​ అబ్బాయ్​.. లోక్​జనశక్తిపార్టీలో ఎత్తులు, పై ఎత్తులు..!
X

ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పెత్తనాలు సహజమే. అందుకు ఈ దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీని తమ గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు కుటుంబరాజకీయాలు జోరుగా జరగుతుంటాయి. తెలుగు నాట తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుటుంబ రాజకీయాలు జరిగి.. చివరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతికి వెళ్లింది. ఇక తమిళనాడులోనూ ఎన్నో గొడవలు, ఎత్తులు పై ఎత్తులు జరిగి.. ప్రస్తుతం స్టాలిన్​ డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక యూపీలోని సమాజ్​వాద్​పార్టీలోనూ కుటుంబ పెత్తనం చూశాం..

ప్రస్తుతం బీహార్​లోని లోక్​జనశక్తి పార్టీలో ఇటువంటి పరిస్థితే ఎదురైంది. రామ్​విలాస్​ పాశ్వాన్​ మరణాంతరం ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ పార్టీలో పాశ్వాన్​ కుమారుడు చిరాగ్​ పాశ్వాన్.. ఆయన చిన్నాన్న పశుపతి కుమార్​ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ప్రస్తుతం పశుపతికి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని చూస్తున్నారు. చిరాగ్​ పాశ్వాన్​కు పార్టీ నడిపే సత్తా లేదని వారు వాదిస్తున్నారు.

మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే లోక్​జనశక్తి పార్టీ.. నిట్ట నిలువునా చీలినట్టు కనిపిస్తున్నది. పార్టీని తమ కంట్రోల్​లో పెట్టుకొనేందుకు చిరాగ్​ పాశ్వాన్​.. ఆయన బాబాయ్​ పశుపతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ’తిరుగుబాటు ఎల్జేపీ’ జాతీయ వర్కింగ్‌ కమిటీ మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది.
సూరజ్‌భాన్‌ సింగ్‌ను పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది.

ఐదు రోజుల్లోపు పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిం చేందుకు ఆయనకు అధికారం ఇచ్చింది. చిరాగ్‌ బాబాయ్‌ పశుపతి కుమా ర్‌ పరాస్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, సీనియర్‌ నేత పరాస్‌ సహా ఐదుగురు తిరుగుబాటు ఎంపీలను పాశ్వాన్‌ వర్గం ఎల్జేపీ నుంచి బహిష్కరించింది.

First Published:  16 Jun 2021 8:03 AM IST
Next Story