ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి..?
సడెన్ గా టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ నితిన్ సెట్స్ పైకి వచ్చేశాడు. మిగతా హీరోలు కూడా రెడీ అయిపోతున్నారు. మరి క్రేజీ ప్రాజెక్టుల సంగతేంటి? ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి రాబోతోంది. ఆర్ఆర్ఆర్, ఎఫ్3, ఆచార్య, పుష్ప సినిమాలు ఈ నెలలో థియేటర్లలోకి రావడం లేదు. వచ్చే నెల మొదటి 2 వారాల్లో ఈ సినిమాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు సెట్ వర్క్ తో బిజీగా ఉంటే, మరికొన్ని […]
సడెన్ గా టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ నితిన్ సెట్స్ పైకి వచ్చేశాడు. మిగతా హీరోలు
కూడా రెడీ అయిపోతున్నారు. మరి క్రేజీ ప్రాజెక్టుల సంగతేంటి? ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి
రాబోతోంది.
ఆర్ఆర్ఆర్, ఎఫ్3, ఆచార్య, పుష్ప సినిమాలు ఈ నెలలో థియేటర్లలోకి రావడం లేదు. వచ్చే నెల మొదటి
2 వారాల్లో ఈ సినిమాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు సెట్ వర్క్ తో బిజీగా ఉంటే,
మరికొన్ని సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే పనిలో బిజీగా ఉన్నాయి.
ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న థ్యాంక్ యు సినిమాను ఈ నెల 21 నుంచి సెట్స్ పైకి
తీసుకురాబోతున్నారు. అటు రవితేజ ఖిలాడీ సినిమా 26 నుంచి సెట్స్ పైకి వస్తుంది. సమంత లీడ్ రోల్
పోషిస్తున్న శాకుంతలం కూడా 24 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న
రాధేశ్యామ్ షెడ్యూల్ కూడా ఈ నెలాఖరుకు మొదలవుతుంది.