Telugu Global
Cinema & Entertainment

వంటల కార్యక్రమంలో తమన్న

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు తమన్న. కేవలం సినిమాలతోనే కాకుండా.. ఏదో ఒక విధంగా బిజీగా ఉండాలని అనుకుంటోంది. రెండు చేతులతో డబ్బులు సంపాదించాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటీటీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇస్తోంది. త్వరలోనే జెమినీ ఛానెల్ లో ప్రత్యక్షం కాబోతోంది తమన్న. ఓ వంటల ప్రొగ్రామ్ లో కనిపించనుంది. మాస్టర్ షెఫ్ తరహాలో స్టయిలిష్ గా రాబోతోంది ఈ కార్యక్రమం. ఇందులో ఆమె వ్యాఖ్యాతగా కనిపించబోతోంది. […]

వంటల కార్యక్రమంలో తమన్న
X

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు తమన్న. కేవలం సినిమాలతోనే కాకుండా.. ఏదో ఒక
విధంగా బిజీగా ఉండాలని అనుకుంటోంది. రెండు చేతులతో డబ్బులు సంపాదించాలనుకుంటోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఓటీటీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు బుల్లితెరపై కూడా ఎంట్రీ
ఇస్తోంది.

త్వరలోనే జెమినీ ఛానెల్ లో ప్రత్యక్షం కాబోతోంది తమన్న. ఓ వంటల ప్రొగ్రామ్ లో కనిపించనుంది.
మాస్టర్ షెఫ్ తరహాలో స్టయిలిష్ గా రాబోతోంది ఈ కార్యక్రమం. ఇందులో ఆమె వ్యాఖ్యాతగా
కనిపించబోతోంది. దీని కోసం తమన్నకు 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టు
తెలుస్తోంది. అది ఎన్ని ఎపిసోడ్ల కార్యక్రమం అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

ప్రస్తుతం తమన్న చేతిలో ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, మ్యాస్ట్రో సినిమాలున్నాయి. వీటిలో మ్యాస్ట్రో సెట్స్
పైకి వచ్చింది. గుర్తుందా శీతాకాలం త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది. ఎఫ్3 మూవీ షూటింగ్ వచ్చేనెల
ప్రారంభం అవుతుంది.

First Published:  15 Jun 2021 2:07 PM IST
Next Story