Telugu Global
Health & Life Style

కరోనాకు కొత్త కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్

కోవిడ్ లక్షణాల నుంచి కోలుకునేందుకు ఓ కొత్త మందు మార్కెట్లో హల్ చల్ చేస్తుంది. మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్స పేరుతో అందుబాటులో ఉన్న ఈ మందు ఒక్కడోసుతోనే లక్షణాలను తగ్గిస్తుంది. దీని ప్రత్యేకతలేంటంటే.. మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ డ్రగ్ ఇవ్వడం వల్ల కోవిడ్ బాధితులు 24 గంటల్లోనే తీవ్రమైన లక్షణాల నుంచి బయటపడుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఈ ట్రీట్ మెంట్ లో భాగంగా యాంటీబాడీల‌ను శ‌రీరంలోకి నేరుగా ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనే […]

కరోనాకు కొత్త కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్
X

కోవిడ్ లక్షణాల నుంచి కోలుకునేందుకు ఓ కొత్త మందు మార్కెట్లో హల్ చల్ చేస్తుంది. మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్స పేరుతో అందుబాటులో ఉన్న ఈ మందు ఒక్కడోసుతోనే లక్షణాలను తగ్గిస్తుంది. దీని ప్రత్యేకతలేంటంటే..

మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ డ్రగ్ ఇవ్వడం వల్ల కోవిడ్ బాధితులు 24 గంటల్లోనే తీవ్రమైన లక్షణాల నుంచి బయటపడుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.

ఈ ట్రీట్ మెంట్ లో భాగంగా యాంటీబాడీల‌ను శ‌రీరంలోకి నేరుగా ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనే కాసిరివిమాబ్‌, ఇమ్డెవిమాబ్ అనే యాంటీబాడీల‌ను ఈ మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌తో కలిపి ఈ డ్రగ్ ను రూపొందించారు. ఇంజెక్షన్ ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించిన ఈ యాంటీబాడీలు కరోనా వైరస్ లోని స్పైక్ ప్రోటీన్లను నాశ‌నం చేస్తాయి. ఈ ప్రోటీన్లను నాశనం చేయడం ద్వారా వైరస్ క‌ణాలు శరీరంలోని కణజాలాలకు అతుక్కుపోకుండా ఉంటుంది. అలా వైర‌స్ ఎక్కువ‌సేపు బ‌త‌క‌కుండా నివారించొచ్చు.

ఈ డ్రగ్ ను వైర‌స్ శ‌రీరంలోకి ప్రవేశించిన మూడు నుంచి ఏడు రోజుల మ‌ధ్య ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డ్రగ్‌ను 12 ఏళ్లు దాటి, 40 కేజీల కంటే ఎక్కువ బ‌రువు ఉన్నవారు మాత్రమే వాడాలి. అలాగే శరీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 90 శాతం కంటే ఎక్కువ‌గా ఉండాలి. అప్పుడే దీని పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే గుండె, మూత్రపిండాల వ్యాధులు, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు వారు కూడా ఈ డ్రగ్ ను తీసుకోవచ్చు.

ఈ కాక్ టెయిల్ ట్రీట్ మెంట్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినప్పటికీ కొంతమందిలో దుర‌ద‌, వికారం, వాంతులు వంటి స‌మ‌స్యలు ఒక‌ట్రెండు రోజులు కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ కాక్‌టెయిల్ డ్రగ్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న‌ల మేర‌కే తగిన వారికి మాత్రమే ఇవ్వాలి.

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా క‌రోనా బారిన ప‌డిన‌ప్పుడు ఈ డ్రగ్‌నే తీసుకున్నారు. అలాగే అమెరికాలో ఇప్పటివరకూ దాదాపు 13 వేల మంది ఈ కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. యూర‌ప్ దేశాల్లోనూ ఈ చికిత్సను బాగానే వాడుతున్నారు. రీసెంట్ గా ఈ డ్రగ్ మనదేశంలోనూ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ డ్రగ్ ధ‌ర‌ ఒక్క డోసుకు రూ.59,750గా నిర్ణయించారు.

First Published:  15 Jun 2021 2:13 AM GMT
Next Story