బార్లు వద్దు.. ఇల్లే ముద్దు
కరోనా ప్రభావంతో విలవిల్లాడిపోయిన చాలా వర్గాల్లో మందుబాబులు కూడా ఉన్నారు. అన్ లాక్ తొలి దశలో ప్రభుత్వాలు కూడా వైన్ షాపులకే తొలి ప్రాధాన్యం ఇచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే బార్లు, రెస్టారెంట్లకు మాత్రం ఇప్పుడు గడ్డుకాలం వచ్చింది. మందుబాబులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, డ్రింక్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసుకుంటున్నారు. బార్లు, రెస్టారెంట్ల అలవాటు తప్పిపోవడం, ఇప్పుడు వాటిని తెరచినా సోషల్ డిస్టెన్స్ అంటూ 50శాతం సీటింగ్ కే అనుమతులివ్వడంతో ఎవ్వరూ ఆవైపు […]
కరోనా ప్రభావంతో విలవిల్లాడిపోయిన చాలా వర్గాల్లో మందుబాబులు కూడా ఉన్నారు. అన్ లాక్ తొలి దశలో ప్రభుత్వాలు కూడా వైన్ షాపులకే తొలి ప్రాధాన్యం ఇచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే బార్లు, రెస్టారెంట్లకు మాత్రం ఇప్పుడు గడ్డుకాలం వచ్చింది. మందుబాబులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, డ్రింక్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసుకుంటున్నారు. బార్లు, రెస్టారెంట్ల అలవాటు తప్పిపోవడం, ఇప్పుడు వాటిని తెరచినా సోషల్ డిస్టెన్స్ అంటూ 50శాతం సీటింగ్ కే అనుమతులివ్వడంతో ఎవ్వరూ ఆవైపు చూడటంలేదట. అదే సమయంలో వైన్ షాపుల సేల్స్ మాత్రం రికవర్ అవుతున్నాయి.
ఖర్చు తక్కువ.. టెన్షన్ తక్కువ..
బార్లు, రెస్టారెంట్లకు వెళ్లడం మానేసి ఇంట్లో తాగడం అలవాటు చేసుకున్నవారికి అదే సుఖంగా అనిపిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. బార్ లో మందు తాగితే.. ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ తో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఏ పోలీస్ ఎక్కడ పట్టుకుంటారో అనే భయం కూడా ఉంటుంది. మందు రేటు కంటే, రెస్టారెంట్ లో సర్వింగ్ చార్జీలు, స్టఫ్ చార్జీలు అన్నీ ఎక్కువే. అదే ఇంట్లోనే దుకాణం పెట్టుకుంటే అన్నీ కలిసొచ్చినట్టే. అయితే ఇంట్లో తాగే అవకాశం ఎంతమందికి ఉంటుందనేదే ప్రశ్నార్థకం.
ఈ ఏడాది సేల్స్ పెరిగాయి..
గతేడాది లాక్ డౌన్ టైమ్ లో లిక్కర్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. అయితే ఈ ఏడాది లాక్ డౌన్ టైమ్ లో మాత్రం కాస్త పెరిగాయి. లిక్కర్ హోమ్ డెలివరీకి కొన్ని ప్రభుత్వాలు అనుమతివ్వడంతో ఈ తేడా స్పష్టంగా కనిపించింది. గత లాక్ డౌన్ అనుభవాల దృష్ట్యా.. సెకండ్ వేవ్ ప్రారంభంలో చాలామంది మందుబాబులు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. మందు స్టాక్ పెట్టుకున్నారు. ఇప్పుడు అన్ లాక్ మొదలైన తర్వాత.. వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి కానీ, బార్లు, రెస్టారెంట్లు మాత్రం ఆ స్థాయిలో మందుబాబుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. మరికొన్నిరోజులపాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంటున్నారు.
రూటు మార్చుకున్న ప్రీమియం బ్రాండ్లు..
లిక్కర్ సేల్స్ లో లాక్ డౌన్ ప్రభావంతో చాలా మార్పులొచ్చాయి. గతంలో ప్రీమియం బ్రాండ్లు కేవలం బార్లు, రెస్టారెంట్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని కూడా వైన్ షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నాయి యాజమాన్యాలు. లాక్ డౌన్ టైమ్ లో 38శాతం మంది ప్రీమియం బ్రాండ్లవైపు మొగ్గు చూపారని సర్వేలు చెబుతున్నాయి. మొత్తమ్మీద.. అన్ని రంగాలతోపాటు లిక్కర్ ఇండస్ట్రీలో కూడా లాక్ డౌన్ చాలా మార్పులు తీసుకొచ్చింది.