Telugu Global
Cinema & Entertainment

కొరటాల బర్త్ డే స్పెషల్ ఇదేనా?

హీరోల పుట్టినరోజులు జరిగితే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తారు. అటు సినిమా యూనిట్ కూడా చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది. కుదిరితే ట్రయిలర్, కుదరకపోతే టీజర్ రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. అదే దర్శకుడి పుట్టినరోజు వస్తే మాత్రం సీన్ మారిపోతుంది. ఈరోజు కొరటాల శివ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆచార్య సినిమా నుంచి ఏదైనా మంచి కంటెంట్ వస్తుందని అంతా భావించారు. కానీ యూనిట్ మాత్రం శుభాకాంక్షలు చెప్పి […]

కొరటాల బర్త్ డే స్పెషల్ ఇదేనా?
X

హీరోల పుట్టినరోజులు జరిగితే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తారు. అటు సినిమా యూనిట్ కూడా చాలా
స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది. కుదిరితే ట్రయిలర్, కుదరకపోతే టీజర్ రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు
చెబుతుంది. అదే దర్శకుడి పుట్టినరోజు వస్తే మాత్రం సీన్ మారిపోతుంది.

ఈరోజు కొరటాల శివ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆచార్య సినిమా నుంచి ఏదైనా మంచి
కంటెంట్ వస్తుందని అంతా భావించారు. కానీ యూనిట్ మాత్రం శుభాకాంక్షలు చెప్పి చేతులు
దులుపుకుంది. ఒక దశలో సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై ఓ మోస్తరు ట్రోలింగ్ కూడా నడిచింది.
దీంతో అప్పటికప్పుడు 2 వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసి మమ అనిపించింది ఆచార్య యూనిట్.

ఒక వర్కింగ్ స్టిల్ లో చిరంజీవితో, మరో స్టిల్ లో చరణ్ తో కొరటాల సంభాషిస్తున్న ఫొటోల్ని విడుదల
చేశారు. ఆ తర్వాత దీనిపై కూడా సోషల్ మీడియాలో ఓ రకమైన అసంతృప్తి కనిపించింది. బ్లాక్ బస్టర్
డైరక్టర్ కే ఇలాంటి ట్రీట్ మెంట్ ఉంటే, ఇక సగటు దర్శకుడి పరిస్థితేంటంటూ సానుభూతి కామెంట్స్
పడుతున్నాయి.

First Published:  15 Jun 2021 2:15 PM IST
Next Story