కర్ణాటకలో అసమ్మతి పీక్స్‌కి .. రహస్యంగా రెబల్ ఎమ్మెల్యేల భేటీ?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదంటూ..అధిష్ఠానం ఎన్ని సార్లు చెబుతున్నా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. రహస్యంగా సమావేశం అవుతున్నారు. మరోవైపు కర్ణాటక వ్యవహారాల ఇంచార్జ్ అరుణ్ సింగ్ మాత్రం.. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటనలు వినిపిస్తున్నారు. అయితే అరుణ్ సింగ్.. యడియూరప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ముందుగా ఆయనను మార్చాలంటూ అసమ్మతి నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారట. యడియూరప్పకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం […]
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదంటూ..అధిష్ఠానం ఎన్ని సార్లు చెబుతున్నా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. రహస్యంగా సమావేశం అవుతున్నారు. మరోవైపు కర్ణాటక వ్యవహారాల ఇంచార్జ్ అరుణ్ సింగ్ మాత్రం.. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటనలు వినిపిస్తున్నారు.
అయితే అరుణ్ సింగ్.. యడియూరప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ముందుగా ఆయనను మార్చాలంటూ అసమ్మతి నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారట. యడియూరప్పకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. మరోవైపు యడియూరప్పను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్ యత్నాళ్, సునీల్‌కుమార్, తిప్పారెడ్డి మంగళవారం రహస్యంగా భేటీ అయిన్నట్టు సమాచారం.
ఇటువంటి పరిణామాల మధ్య అరుణ్ సింగ్ బుధవారం బెంగళూరుకు రాబోతున్నారు. కర్ణాటకలోని మంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నారు. అయితే ఈ మీటింగ్‌కు ముఖ్యమంత్రిని ఆహ్వానించొద్దంటూ మంత్రి సీపీ యోగేశ్వర్ .. అరుణ్‌సింగ్‌ను కోరినట్టు సమాచారం. ఈ సమావేశానికి సీఎం వస్తే.. మంత్రులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పలేరని ఆయన సూచించారట.
ఇప్పటికే యడియూరప్ప.. ఆయన కుమారుడి పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కర్ణాటకలో ఏం జరగబోతుంది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.