Telugu Global
National

పైలట్​దే పైచేయి.. రాజస్థాన్​ రాజకీయాల్లో కీలక మార్పులు..!

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాట్​.. అక్కడి యువనేత సచిన్​ పైలట్​ మధ్య చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ దశలో పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చేందుకు యత్నించారు. బీజేపీలో చేరిపోతున్నారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు కాంగ్రెస్​ అధిష్ఠానం ఆయనను శాంతపరిచింది. అప్పటినుంచి సచిన్​ పైలట్​ తన వర్గీయులకు క్యాబినెట్​లో స్థానం కల్పించాలని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్​లో వర్గ పోరు కొత్తది కాదు.. ఒకరికి పదవి ఇస్తే.. మరొకరు మండిపడుతుంటారు. కలిసి కట్టుగా […]

పైలట్​దే పైచేయి.. రాజస్థాన్​ రాజకీయాల్లో కీలక మార్పులు..!
X

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాట్​.. అక్కడి యువనేత సచిన్​ పైలట్​ మధ్య చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ దశలో పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చేందుకు యత్నించారు. బీజేపీలో చేరిపోతున్నారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి.

ఎట్టకేలకు కాంగ్రెస్​ అధిష్ఠానం ఆయనను శాంతపరిచింది. అప్పటినుంచి సచిన్​ పైలట్​ తన వర్గీయులకు క్యాబినెట్​లో స్థానం కల్పించాలని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్​లో వర్గ పోరు కొత్తది కాదు.. ఒకరికి పదవి ఇస్తే.. మరొకరు మండిపడుతుంటారు. కలిసి కట్టుగా పనిచేయడం ఆ పార్టీ సంస్కృతికి భిన్నం.

ఇదిలా ఉంటే రాజస్థాన్​ రాజకీయాలు సైతం అలాగే మారాయి. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ బలహీన పడుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు వస్తున్నా.. వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్​ నేతలు విఫలమయ్యారన్న వాదనలు కొనసాగుతున్నాయి.

ఒక్క రాజస్థాన్​లో కాక.. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​ పరిస్థితి అలాగే ఉంది. ఉత్తరప్రదేశ్​లో జితిన్​ ప్రసాద అనే కీలక నేత ఆ పార్టీకి గుడ్​బై చెప్పి బీజేపీలో చేరారు. ఇక పంజాబ్​లోనూ సీఎం అమరీందర్​సింగ్​, నవజ్యోతి సింగ్​ సిద్దూకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్​లో పరిస్థితులు చేయి జారకముందే చక్కదిద్దే కార్యక్రమాలు మొదలు పెట్టింది కాంగ్రెస్​. ఇటీవల రాజస్థాన్​ కీలక నేత సచిన్​ పైలట్​ పార్టీ మారబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజస్థాన్​లో వెంటనే క్యాబినెట్​ విస్తరించి.. సచిన్​ పైలట్​ వర్గీయులకు ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని సోనియాగాంధీ భావిస్తున్నారట. ఈ మేరకు ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీచేశారట. ఎట్టకేలకు సచిన్​ పైలట్ తన పంతం నెగ్గించుకున్నారని భావిస్తున్నారు విశ్లేషకులు.

First Published:  14 Jun 2021 9:24 AM IST
Next Story