Telugu Global
National

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లకు మార్గదర్శకాలు..

సోషల్ మీడియాలో జరిగే పెయిడ్ ప్రమోషన్లపై ప్రభుత్వం నిఘా పెట్టింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లంతా ఈరోజు నుంచి నియమనిబంధనలు పాటించాల్సిందే. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI) ఈమేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఎవరీ ఇన్ ఫ్లూయన్సర్లు.. సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోవర్లు కలిగిన వారంతా ఇన్ ఫ్లూయన్సర్లే. గతంలో సినీ తారలు, క్రికెటర్లు, అడపాదడపా రాజకీయ నాయకులు ఇన్ ఫ్లూయన్సర్లుగా ఉండేవారు. సోషల్ మీడియాలో వారు చేసే పోస్టింగ్ లకు అత్యథిగ జనాదరణ […]

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లకు మార్గదర్శకాలు..
X

సోషల్ మీడియాలో జరిగే పెయిడ్ ప్రమోషన్లపై ప్రభుత్వం నిఘా పెట్టింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లంతా ఈరోజు నుంచి నియమనిబంధనలు పాటించాల్సిందే. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI) ఈమేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ఎవరీ ఇన్ ఫ్లూయన్సర్లు..
సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోవర్లు కలిగిన వారంతా ఇన్ ఫ్లూయన్సర్లే. గతంలో సినీ తారలు, క్రికెటర్లు, అడపాదడపా రాజకీయ నాయకులు ఇన్ ఫ్లూయన్సర్లుగా ఉండేవారు. సోషల్ మీడియాలో వారు చేసే పోస్టింగ్ లకు అత్యథిగ జనాదరణ కలిగి ఉంటుంది కాబట్టి.. ఆయా కంపెనీలు వారితో ప్రమోషన్ కార్యక్రమాలు చేయించుకుంటుండేవి. నేరుగా ఫలానా బ్రాండ్ కొనండి అని చెప్పరు కానీ, వారి చేతుల్లో, చేతల్లో ఆయా బ్రాండ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. పరోక్షంగా ఇది పెయిడ్ ప్రమోషన్. న్యూస్ పేపర్లు, టీవీ ఛానెళ్లలో నేరుగా ఆ కంపెనీలు చేసే ప్రచారం కంటే ఇదే ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది.

కాలం మారింది..
గతంలో సినీతారలు, క్రికెటర్లు.. ఇలా ఈ ఇన్ ఫ్లూయన్సర్ల జాబితా కాస్త చిన్నదిగానే ఉండేది. కానీ సోషల్ మీడియా హవా పెరిగిపోయిన తర్వతా యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలంతా ఇన్ ఫ్లూయన్సర్లుగా మారిపోయారు. అయితే వీరు చేసే ప్రమోషన్ లో చెప్పేదంతా వాస్తవాలా కాదా అనేదే ఇప్పుడు చర్చ. సోషల్ మీడియాలో జరిగే పెయిడ్ ప్రమోషన్లు చాలావరకు అసత్యాలు అనే అపవాదు కూడా ఉంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై భారత ప్రభుత్వం నిఘా పెట్టలేదు. ఇటీవల సోషల్ మీడియాపై నిఘా ఉంచిన ప్రభుత్వం. ఇన్ ఫ్లూయన్సర్ల వ్యవహారంపై కూడా ఆంక్షలు విధించింది. ASCI రూపొందించిన గైడ్ లైన్స్ ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఫ్రెంచ్ టెక్నాలజీ ప్రొవైడర్ తో కలసి ASCI సోషల్ మీడియాపై నిఘా పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డిజిటల్ కంటెంట్ ని స్కాన్ చేస్తున్నట్టు తెలిపారు ASCI సెక్రటరీ జనరల్ మనీషా కపూర్. ప్రమోషన్ కంటెంట్ పై ఫిర్యాదులు వస్తే.. సదరు కంపెనీలకు సమాచారం అందించి.. వారి ద్వారా ఇన్ ఫ్లూయన్సర్ల నుంచి ఆ కంటెంట్ తొలగిస్తామని చెబుతున్నారామె.

భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల మార్కెట్ విలువ దాదాపు 550కోట్ల రూపాయలనుంచి వెయ్యికోట్ల పైమాటే. ప్రపంచ మార్కెట్ విలువ దాదాపు 12వేల కోట్ల రూపాయలు. ఇప్పటికే అమెరికా, యూకేలో ఈ ఇన్ ఫ్లూయన్సర్ల మార్కెటింగ్ పై ఆంక్షలున్నాయి. ఇప్పుడు భారత్ లో కూడా వీటికి నియమ నిబంధనలు విధించారు.

First Published:  14 Jun 2021 12:34 PM IST
Next Story