Telugu Global
National

గుజరాత్​లోనూ పోటీకి సై.. అరవింద్​ కేజ్రీవాల్​ సంచలన ప్రకటన..!

ఆమ్​ ఆద్మీ పార్టీ క్రమంగా ఉత్తరాదిన పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే పంజాబ్​లో బలపడ్డ ఆప్, బీహార్​లోనూ ఓటు బ్యాంకును సంపాదించుకున్నది. 2022లో గుజరాత్​లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతున్నదని ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్​ కొత్త తరహాలో రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. మరోవైపు ఢిల్లీలో ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ముందుకు వెళుతున్న తీరు […]

గుజరాత్​లోనూ పోటీకి సై.. అరవింద్​ కేజ్రీవాల్​ సంచలన ప్రకటన..!
X

ఆమ్​ ఆద్మీ పార్టీ క్రమంగా ఉత్తరాదిన పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే పంజాబ్​లో బలపడ్డ ఆప్, బీహార్​లోనూ ఓటు బ్యాంకును సంపాదించుకున్నది. 2022లో గుజరాత్​లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతున్నదని ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఆప్​ కొత్త తరహాలో రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. మరోవైపు ఢిల్లీలో ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ముందుకు వెళుతున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నది. దీంతో ఉత్తరాదిన ఆ పార్టీ బలపడుతోంది.

ఈ ఏడాది సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 120 స్థానాల్లో ఆప్​ పోటీ చేసి 27 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఆమ్​ ఆద్మీ పార్టీకి నమ్మకం వచ్చింది. గుజరాత్​లోనూ తమకు బలం పెరుగుతున్నదంటూ ఆ పార్టీ నమ్మకంగా ఉంది. ఈ క్రమంలో అరవింద్​ కేజ్రీవాల్ గుజరాత్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామన్నారు. కేజ్రీవాల్ ప్రకటనతో గుజరాత్​ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

గుజరాత్​ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆప్​ పోటీచేస్తే.. పరిస్థితి ఏమిటి? ఎవరికి నష్టం? అన్న చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. కాంగ్రెస్​ నష్టపోతుంది తప్ప.. బీజేపీకి ఎటువంటి నష్టం ఉండదని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్​ కూడా అక్కడ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నది. ప్రస్తుతం బీజేపీ పెద్దలు యూపీపై దృష్టి కేంద్రీకరించారు. అనంతరం గుజరాత్​ రాజకీయాల పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

First Published:  14 Jun 2021 2:32 PM IST
Next Story