ఓటీటీలోకి నయనతార సినిమా
నయనతారకు ఓటీటీ కొత్త కాదు. ఆమె సినిమా ఒకటి ఆల్రెడీ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే బాటలో నయన్ నుంచి మరో మూవీ ఓటీటీలోకి వచ్చేలా ఉంది. కెరీర్ లో నయనతారకు ఇది రెండో ఓటీటీ స్ట్రయిట్ రిలీజ్ అవుతుంది. మిలింద్ రావు దర్శకత్వంలో నెట్రికన్ అనే సినిమా చేసింది నయన్. లెక్కప్రకారం ఈపాటికి సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. థియేటర్లు తెరిచిన తర్వాత కూడా 50శాతం ఆక్యుపెన్సీతో […]
నయనతారకు ఓటీటీ కొత్త కాదు. ఆమె సినిమా ఒకటి ఆల్రెడీ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే
బాటలో నయన్ నుంచి మరో మూవీ ఓటీటీలోకి వచ్చేలా ఉంది. కెరీర్ లో నయనతారకు ఇది రెండో ఓటీటీ
స్ట్రయిట్ రిలీజ్ అవుతుంది.
మిలింద్ రావు దర్శకత్వంలో నెట్రికన్ అనే సినిమా చేసింది నయన్. లెక్కప్రకారం ఈపాటికి సినిమా
రిలీజ్ అవ్వాలి. కానీ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. థియేటర్లు తెరిచిన తర్వాత కూడా 50శాతం
ఆక్యుపెన్సీతో ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు
ఇచ్చేయాలని అనుకుంటున్నారు.
ఈ మేరకు డిస్నీ హాట్ స్టార్ సంస్థ నెట్రికన్ యూనిట్ తో చర్చలు జరుపుతోంది. మరో వారం రోజుల్లో డీల్
పూర్తయిపోతుంది. వచ్చేనెలలో ఇది స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు నయన్
నటించిన అమ్మోరు తల్లి సినిమా కూడా ఇలానే డైరక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. అన్నట్టు నెట్రికన్ లో
నయనతార అంథురాలిగా కనిపించబోతోంది.