Telugu Global
National

అన్ లాకింగ్ లో ఢిల్లీ ఫస్ట్..

సెకండ్ వేవ్ అప్రమత్తత విషయంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేసింది. మిగతా రాష్ట్రాలకంటే ముందుగానే లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అదే సమయంలో ఆక్సిజన్, వ్యాక్సిన్ కోసం కేంద్రంతో కొట్లాట పెట్టుకున్నారు. ఏదేమైనా.. లాక్ డౌన్ అక్కడ సత్ఫలితాలిచ్చింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న వేళ, ఢిల్లీలో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పుడు అన్ లాకింగ్ ప్రక్రియ విషయంలో కూడా దూకుడు […]

అన్ లాకింగ్ లో ఢిల్లీ ఫస్ట్..
X

సెకండ్ వేవ్ అప్రమత్తత విషయంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేసింది. మిగతా రాష్ట్రాలకంటే ముందుగానే లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అదే సమయంలో ఆక్సిజన్, వ్యాక్సిన్ కోసం కేంద్రంతో కొట్లాట పెట్టుకున్నారు. ఏదేమైనా.. లాక్ డౌన్ అక్కడ సత్ఫలితాలిచ్చింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న వేళ, ఢిల్లీలో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పుడు అన్ లాకింగ్ ప్రక్రియ విషయంలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు సీఎం కేజ్రీవాల్.

సోమవారం నుంచి ఢిల్లీలో మరిన్ని సడలింపులు అమలులోకి వస్తున్నాయి.
– హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. 50శాతం సీటింగ్ తో రెస్టారెంట్లలో విందు, వినోదాలకు పర్మిషన్.
– ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వందశాతం హాజరుకి అనుమతి. గ్రూప్ ఎ అధికారులు వందశాతం, మిగతా సిబ్బంది 50శాతం విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు.
– ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్ షిఫ్ట్ వరకు అనుమతి.
– ప్రజా రవాణాకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్. ఆటోలు, ఇ-రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్స్ లో డ్రైవర్ కాకుండా ఇద్దరు ప్రయాణికుల్ని ఎక్కించుకునేందుకు అనుమతి.
– మెట్రో రైళ్లు, బస్సుల్లో 50శాతం సీటింగ్ తో ప్రయాణికులకు అనుమతి.
– ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షల ఎత్తివేత, నగరంలో ఈ-పాస్ లు అవసరం లేకుండానే ప్రయాణాలకు అనుమతి. సరకు రవాణాపై నిబంధనలు ఎత్తివేత.
– వీకెండ్ మార్కెట్ లకు అనుమతి.
– ఢిల్లీలోని అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు తెరచుకునేలా అనుమతి, భక్తుల ప్రవేశంపై మాత్రం ఆంక్షలు.
– మార్కెట్లు, మాల్స్‌.. ఇప్పటిలాగే సరి, బేసి విధానంలో మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతి.

ప్రస్తుతానికి స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మల్టీప్లెక్స్ లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, పార్క్ లపై ఉన్న నిషేధం అలాగే కొనసాగుతోంది. అయితే వచ్చే వారం నుంచి వాటిపై కూడా నిషేధం ఎత్తివేస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ విషయంలో ముందుచూపుతో వ్యవహరించిన కేజ్రీవాల్.. కేసులు తగ్గుతున్న వేళ, అన్ లాకింగ్ విషయంలో కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జన జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

First Published:  13 Jun 2021 11:10 AM GMT
Next Story