Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమాపై బాలయ్య క్లారిటీ

రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానెల్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు బాలయ్య. ఆ ఇంటర్వ్యూలో చాలా సంగతులు చెప్పుకొచ్చారు. కొడుకు ఎంట్రీ పై కూడా స్పందించారు. తన నెక్ట్స్ మూవీ విశేషాలు కూడా చెప్పారు. కానీ అనీల్ రావిపూడితో సినిమా ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆయన చెప్పలేదు అనేకంటే, సదరు యాంకర్ అడగలేదు అనడం కరెక్ట్. అలా 2 రోజులుగా సస్పెన్స్ లో ఉండిపోయిన ఆ సినిమాను […]

కొత్త సినిమాపై బాలయ్య క్లారిటీ
X

రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానెల్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు బాలయ్య. ఆ
ఇంటర్వ్యూలో చాలా సంగతులు చెప్పుకొచ్చారు. కొడుకు ఎంట్రీ పై కూడా స్పందించారు. తన నెక్ట్స్ మూవీ
విశేషాలు కూడా చెప్పారు. కానీ అనీల్ రావిపూడితో సినిమా ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మాత్రం
చెప్పలేదు. ఆయన చెప్పలేదు అనేకంటే, సదరు యాంకర్ అడగలేదు అనడం కరెక్ట్.

అలా 2 రోజులుగా సస్పెన్స్ లో ఉండిపోయిన ఆ సినిమాను తిరిగి బాలకృష్ణే కన్ ఫర్మ్ చేశారు. కొంద‌రు
అభిమానుల‌తో జూమ్‌లో మాట్లాడారు బాలయ్య. ఈ సంద‌ర్భంగా ఓ అభిమాని, బాలయ్యను అనిల్
రావిపూడితో సినిమా గురించి అడిగాడు. దీనికి బాల‌య్య బ‌దులిస్తూ… అనిల్ రావిపూడితో సినిమా
కచ్చితంగా ఉంటుంద‌ని, ప్రస్తుతం కథా చర్చ‌లు కొనసాగుతున్నాయని క్లారిటీ ఇచ్చాడు.

అలా అనీల్ రావిపూడి, బాలయ్య సినిమాపై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు
బాలయ్య. ఆ వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తర్వాత అనీల్ రావిపూడి
సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  13 Jun 2021 12:08 PM IST
Next Story