Telugu Global
Cinema & Entertainment

వినాయక్ చెంతకు మరో రీమేక్

చూస్తుంటే వీవీ వినాయక్ రీమేక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉన్నాడు. రీమేక్స్ తీయడంలో తను స్పెషలిస్ట్ అనిపించుకున్న వినాయక్ చెంతకు ఇప్పుడు అన్నీ అలాంటి ఆఫర్లే వస్తున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ హీరోగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు వినాయక్. ఇప్పుడు మరో ఆఫర్ వచ్చింది. తమిళ్ లో హిట్టయిన కర్ణన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు బెల్లంకొండ. ఈ సినిమా రీమేక్ బాధ్యతల్ని కూడా వినాయక్ కే అప్పగించినట్టు తెలుస్తోంది. నిజానికి మొన్నటివరకు […]

వినాయక్ చెంతకు మరో రీమేక్
X

చూస్తుంటే వీవీ వినాయక్ రీమేక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉన్నాడు. రీమేక్స్ తీయడంలో తను
స్పెషలిస్ట్ అనిపించుకున్న వినాయక్ చెంతకు ఇప్పుడు అన్నీ అలాంటి ఆఫర్లే వస్తున్నాయి. ప్రస్తుతం
బెల్లంకొండ హీరోగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు వినాయక్. ఇప్పుడు మరో ఆఫర్
వచ్చింది.

తమిళ్ లో హిట్టయిన కర్ణన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు బెల్లంకొండ. ఈ సినిమా రీమేక్
బాధ్యతల్ని కూడా వినాయక్ కే అప్పగించినట్టు తెలుస్తోంది. నిజానికి మొన్నటివరకు శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపించింది. ప్రస్తుతం అతడు నారప్ప అనే రీమేక్ చేస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి అతడి స్థానంలో
వినాయక్ పేరు వినిపిస్తోంది.

వినాయక్ కు ఎప్పట్నుంచో ఓ సమస్య ఉంది. డైరక్ట్ చేయడానికి అతడు రెడీ. కానీ కథలు మాత్రం
దొరకడం లేదు. ఎందుకంటే వినాయక్ కథారచయిత కాదు. కేవలం దర్శకుడు మాత్రమే. అందుకే
తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా రీమేక్స్ చేయాల్సి వస్తోంది ఈ సూపర్ హిట్ డైరక్టర్.

First Published:  12 Jun 2021 2:45 PM IST
Next Story