ఈటల రాజీనామా ఆమోదం
ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటినుంచి తెలంగాణ లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 14న ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని గన్‌పార్కుకు చేరుకొని .. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, […]
ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటినుంచి తెలంగాణ లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 14న ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోన్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని గన్‌పార్కుకు చేరుకొని .. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, తుల ఉమ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ఈటల రాజేందర్ .. ఇవాళ స్పీకర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కార్యదర్శికి రాజీనామా లేఖ అందించారు. అనంతరం స్పీకర్‌కు ఫ్యాక్స్ లో రాజీనామాను పంపించారు. ఆయన రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.
ఈటల రాజేందర్‌తోపాటు ఆర్టీసీ ఉద్యమ నేత అశ్వత్ధామ రెడ్డి తదితరులు ఈటల వెంట ఢిల్లీ వెళ్లబోతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్ తన అనుచరులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లబోతున్నట్టు తెలిసింది. ఇక ఇవాళ గన్ పార్క్ వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర యుద్ధం మొదలైనట్టేనని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ’
హుజురాబాద్‌లో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పోరాటం.. కేసీఆర్ కుటుంబానికి యావత్ తెలంగాణ ప్రజానికానికి మధ్య జరుగుతోంది. నేను హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా. నా ప్రజలంతా నా వెంటే ఉన్నారు.
నిర్భందాలు నాకు కొత్త కాదు. రాష్ట్రంలో కరోనాతో చనిపోతుంటే పట్టించుకోరు. వడ్లు మొలకెత్తుతున్నా ధాన్యం కొనేవాళ్లు లేరు. కానీ నా మీద విచారణ జరిపేందుకు మాత్రం వందల మంది అధికారులను వినియోగించుకుంటున్నారు. ’ అంటూ ఈటల రాజేందర్ ఉద్వేగంతో మాట్లాడారు.