Telugu Global
Cinema & Entertainment

సమంత చెంతకు మరో ఓటీటీ డీల్

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, ఇప్పుడు ఓటీటీలో కూడా సమంత హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ సీజన్-2 సూపర్ హిట్టయిందో, సినిమా ఆఫర్లతో పాటు ఓటీటీ ఆఫర్లు కూడా ఆమె గుమ్మం ముందు క్యూ కట్టడం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఫ్యామిలీ మేన్ చేసిన సమంతకు, నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ అందించింది. తమ ఓటీటీ వేదికపై ఓ […]

సమంత చెంతకు మరో ఓటీటీ డీల్
X

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, ఇప్పుడు ఓటీటీలో కూడా సమంత హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడైతే
ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ సీజన్-2 సూపర్ హిట్టయిందో, సినిమా ఆఫర్లతో పాటు ఓటీటీ ఆఫర్లు కూడా
ఆమె గుమ్మం ముందు క్యూ కట్టడం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఆమెకు మరో క్రేజీ ఆఫర్
వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఫ్యామిలీ మేన్ చేసిన సమంతకు, నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ అందించింది.
తమ ఓటీటీ వేదికపై ఓ వెబ్ సిరీస్ చేస్తే కళ్లుచెదిరే ఎమౌంట్ ఇస్తామని ఊరిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు
సంబంధించి పూర్తి నిర్ణయాధికారాన్ని కూడా సమంతకే వదిలేసింది. అంటే కథ, దర్శకుడ్ని సమంతే
సెలక్ట్ చేసుకోవచ్చన్నమాట.

ఫ్యామిలీ మేన్ కోసం 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది సమంత. దానికి రెట్టింపు మొత్తం
ఇచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చినట్టు సమాచారం. చూస్తుంటే.. సమంత నెట్ ఫ్లిక్స్ ఆఫర్ కూడా
అంగీకరించేలా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో శాకుంతలం అనే సినిమా ఉంది.

First Published:  12 Jun 2021 2:42 PM IST
Next Story