Telugu Global
Cinema & Entertainment

హిట్ కోసం ప్లాన్ మార్చిన నితిన్

రీసెంట్ గా నితిన్ ఓ బహిరంగ ప్రకటన చేశాడు. అదేంటంటే.. ఇకపై లవ్ స్టోరీస్ లో నటించనని చెప్పేశాడు. రంగ్ దే సినిమానే తన చివరాఖరి ప్రేమకథ అని కూడా తేల్చేశాడు. తన స్టేట్ మెంట్ పై నిలబడుతూ.. చెక్ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న మ్యాస్ట్రో కూడా ప్రయోగాత్మక సినిమానే. అయితే తన మాటపై నితిన్ ఎక్కువ రోజులు నిలబడేలా లేడు. ఎందుకంటే, చెక్ సినిమా నితిన్ ప్లాన్స్ కు చెక్ పెట్టింది. దీంతో […]

హిట్ కోసం ప్లాన్ మార్చిన నితిన్
X

రీసెంట్ గా నితిన్ ఓ బహిరంగ ప్రకటన చేశాడు. అదేంటంటే.. ఇకపై లవ్ స్టోరీస్ లో నటించనని
చెప్పేశాడు. రంగ్ దే సినిమానే తన చివరాఖరి ప్రేమకథ అని కూడా తేల్చేశాడు. తన స్టేట్ మెంట్ పై
నిలబడుతూ.. చెక్ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న మ్యాస్ట్రో కూడా ప్రయోగాత్మక
సినిమానే.

అయితే తన మాటపై నితిన్ ఎక్కువ రోజులు నిలబడేలా లేడు. ఎందుకంటే, చెక్ సినిమా నితిన్ ప్లాన్స్ కు
చెక్ పెట్టింది. దీంతో అతడు తను చేయబోతున్న సినిమాలపై మరోసారి సమీక్ష నిర్వహించాడు. ఇందులో
భాగంగా ప్రయోగాత్మక చిత్రం పవర్ పేటను మరోసారి ఆపేయాలని నిర్ణయించుకున్నాడట నితిన్.

నిజానికి ఈ సినిమాను దర్శకుడు కృష్ణచైతన్య, ముందుగా వరుణ్ తేజ్ తో ప్లాన్ చేశాడు. కానీ అగ్రిమెంట్స్
వల్ల నితిన్ కాంపౌండ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా 2 భాగాలుగా కూడా మారింది. అంతా ఓకే
అనుకున్న టైమ్ లో ఇప్పుడు నితిన్ మళ్లీ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

First Published:  12 Jun 2021 2:44 PM IST
Next Story