Telugu Global
National

ముకుల్​రాయ్​.. గుడ్​బై.. బీజేపీకి బ్యాడ్​టైం స్టార్ట్​ అయ్యిందా?

బెంగాల్​లో బీజేపీ బ్యాడ్​టైం స్టార్ట్​ అయినట్టు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్​లో బీజేపీ ఎంతో ఉత్సాహంతో కనిపించింది. ఓ దశలో టీఎంసీ నేతలపై కేసులు, ఈడీ సోదాలు, సీబీఐ తనిఖీలతో బెంగాల్​ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక దీదీ కూడా బీజేపీకి స్ట్రాంగ్​గానే కౌంటర్​ ఇచ్చిందనుకోండి. ముకుల్​రాయ్​ 2017లో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు టీఎంసీకి చెందిన కీలక నేతలు చాలా మంది బీజేపీలో చేరారు. సువేందు అధికారి వంటి వారు […]

ముకుల్​రాయ్​.. గుడ్​బై.. బీజేపీకి బ్యాడ్​టైం స్టార్ట్​ అయ్యిందా?
X

బెంగాల్​లో బీజేపీ బ్యాడ్​టైం స్టార్ట్​ అయినట్టు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్​లో బీజేపీ ఎంతో ఉత్సాహంతో కనిపించింది. ఓ దశలో టీఎంసీ నేతలపై కేసులు, ఈడీ సోదాలు, సీబీఐ తనిఖీలతో బెంగాల్​ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక దీదీ కూడా బీజేపీకి స్ట్రాంగ్​గానే కౌంటర్​ ఇచ్చిందనుకోండి.

ముకుల్​రాయ్​ 2017లో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు టీఎంసీకి చెందిన కీలక నేతలు చాలా మంది బీజేపీలో చేరారు. సువేందు అధికారి వంటి వారు అందులో ముఖ్యులు. ఓ దశలో అమిత్​ షా మాట్లాడుతూ.. ఇక టీఎంసీలో మమతా బెనర్జీ, ఆమె అల్లుడు మినహా ఎవరూ ఉండరేమో? అని వ్యాఖ్యానించారంటే టీఎంసీ నేతలు ఎంత మంది కాషాయ పార్టీలోకి వెళ్లారో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం బెంగాల్​ బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​.. బీజేపీకి గుడ్​బై చెప్పారు. శుక్రవారం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీలో చేరారు. బెంగాల్​లో ఎలాగైనా బలపడుదామనుకున్న బీజేపీకి ఇది పెద్ద షాక్​ అనే భావించవచ్చు.

నిజానికి ముకుల్​ రాయ్​ బీజేపీలో చేరినా.. మమత మీద పెద్దగా ద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు. సైద్ధాంతిక పరమైన విమర్శలు మాత్రమే చేశారు. మరో నేత సువేందు అధికారి మాత్రం మమతతో తాడోపేడో తేల్చుకుందాం.. అన్నట్టుగా ప్రవర్తించారు.

అయితే తొలుత ముకుల్ రాయ్​ బీజేపీలో చేరినప్పటికీ.. ఆ తర్వాత చేరిన సువేందు అధికారికే పార్టీలో ప్రాధాన్యం దక్కింది. ఆయనను బీజేపీ శాసనసభపక్షనేతగా ఎన్నుకున్నారు. ఈ పరిణామంతో ముకుల్ నోచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముకుల్​ భార్యకు ఇటీవల కరోనా సోకగా.. నేరుగా మమతా బెనర్జీ, మమత మేనల్లుడు, మంత్రి అభిషేక్​ బెనర్జీ ఆమెను పరామర్శించారు. ముకుల్ రాయ్​కి ధైర్యం చెప్పారు. అప్పటినుంచే ముకుల్​ రాయ్​ బీజేపీలో చేరతారన్న వార్తలు రాగా ఇప్పుడు అదే నిజమైంది.

First Published:  11 Jun 2021 8:36 PM GMT
Next Story