ఆ హీరోయిన్ ను కరోనా మార్చింది
కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. జనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అప్పటివరకు తమది ఉక్కు లాంటి శరీరం అని భావించేవాళ్లు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు పడ్డారు. అలా ఇబ్బందులు పడిన వాళ్లు తమ మైండ్ సెట్ కూడా మార్చుకున్నారు. అలాంటి వాళ్లలో కత్రినాకైఫ్ ఒకరు. రీసెంట్ గా కరోనా బారిన పడి కోలుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ మహమ్మారి తన స్వభావాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చింది. కరోనాకు ముందు చాలా దుందుడుకుగా, నిర్లక్ష్యంగా ఉండేదట కత్రినాకైఫ్. […]
కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. జనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అప్పటివరకు
తమది ఉక్కు లాంటి శరీరం అని భావించేవాళ్లు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు పడ్డారు. అలా
ఇబ్బందులు పడిన వాళ్లు తమ మైండ్ సెట్ కూడా మార్చుకున్నారు. అలాంటి వాళ్లలో కత్రినాకైఫ్ ఒకరు.
రీసెంట్ గా కరోనా బారిన పడి కోలుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ మహమ్మారి తన స్వభావాన్ని పూర్తిగా
మార్చేసిందని చెప్పుకొచ్చింది. కరోనాకు ముందు చాలా దుందుడుకుగా, నిర్లక్ష్యంగా ఉండేదట కత్రినాకైఫ్.
ఎప్పుడైతే కరోనా సోకి, ఒంటరిగా హోం ఐసొలేషన్ లో కూర్చోవాల్సి వచ్చిందో, అప్పుడు తనకు సహనం,
ఓపిక అలవాటయ్యాయని చెప్పుకొచ్చింది.
కరోనా తర్వాత తన ప్రాధామ్యాలు పూర్తిగా మారిపోయాయని, ప్రాణం-మానవ సంబంధాల కంటే గొప్ప
విషయాలు ఇంకేవీ లేవని అంటోంది. మొత్తమ్మీద నిత్యం బిజీగా ఉండే కత్రినాను కూడా కరోనా
మార్చేసిందన్నమాట.