Telugu Global
Health & Life Style

ఆహారం విషంగా మారకూడదంటే..

మనం తీసుకున్న ఆహారం మనల్ని కాపాడడమే కాదు, అప్పుడప్పుడు మ‌నల్ని చంపేస్తుంది కూడా.. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆహారం విషపూరితమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రతీ ఏటా దాదాపు 4.20 లక్షల మంది ప్రజలు విషపూరితమైన ఆహారం తీసుకుని రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అసలు ఆహారం విషపూరితంగా ఎప్పుడు మారుతుందంటే.. ఆహారం విషపూరితమయ్యే అవకాశం ఎక్కువ మాంసాహారం విషయంలో జరుగుతుంటుంది. ప్యాక్ చేసిన మాంసాహారం చాలా త్వరగా విషపూరితమవుతుంది. అందుకే […]

ఆహారం విషంగా మారకూడదంటే..
X

మనం తీసుకున్న ఆహారం మనల్ని కాపాడడమే కాదు, అప్పుడప్పుడు మ‌నల్ని చంపేస్తుంది కూడా.. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆహారం విషపూరితమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రతీ ఏటా దాదాపు 4.20 లక్షల మంది ప్రజలు విషపూరితమైన ఆహారం తీసుకుని రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అసలు ఆహారం విషపూరితంగా ఎప్పుడు మారుతుందంటే..

ఆహారం విషపూరితమయ్యే అవకాశం ఎక్కువ మాంసాహారం విషయంలో జరుగుతుంటుంది. ప్యాక్ చేసిన మాంసాహారం చాలా త్వరగా విషపూరితమవుతుంది. అందుకే మాంసాన్ని తాజాగా ఉన్నప్పుడే వండేయాలి. అలాగే పచ్చి మాంసాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచడం కూడా మంచిది కాదు. అలాగే మాంసాహారాన్ని సాధారణంగా 74 సెంటీగ్రేడ్ వ‌ద్ద ఉడికించ‌డం మంచిది.

ఫుడ్ పాయిజన్ జరిగే మరో ఆహారం ప్యాకేజ్డ్ ఫుడ్. ప్యాకేజ్డ్ ఫుడ్ లో వాడే ఇంగ్రెడియంట్స్ అవి నిల్వ ఉండేందుకు వాడే ప్రిజర్వేటివ్స్.. త్వరగా విషపూరితంగా మారే ప్రమాదముంది. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకునే ముందు వాటి ఎక్స్పైరీ డేట్, త‌యారీలో వాడిన ప‌దార్థాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. డేట్ దాటిన పదార్థాలు త్వరగా విషంగా మారే అవకాశం ఉంది. అలాగే రెడీ టు ఈట్ ప‌దార్థాల‌ను ఎంత త‌క్కువ‌గా వాడితే అంత మంచిద‌ని గుర్తుంచుకోవాలి.

ఇకపోతే ఆహార ప‌దార్థాలను ఫ్రిజ్‌లో పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పండ్లు, కూరగాయలను 3 నుంచి 4 రోజుల వరకూ మాత్రమే ఉంచాలి. అలాగే వెన్న నెల రోజులు, పాలు నాలుగైదు రోజులు, పన్నీర్ వారం రోజులు, చీజ్ 3 వారాలు, పెరుగు ఒక వారం.. ఇలా నిర్థిష్టమైన సమయం పాటు మాత్రమే విటిని ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. ఫ్రిజ్ లో మరీ ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల కూడా కొన్ని ఆహార పదార్థాలు విషపూరితంగ మారే ప్రమాదముంది.

ఆహారం సేఫ్ గా ఉండాలంటే వంటగది పరిసరాలు కూడా ఎంతో ముఖ్యం. కిచెన్ లో వంట‌కు ఉప‌యోగించే ప‌దార్థాల‌ను, వంట సామ‌గ్రిని, పాత్రల‌ను ఎప్పటికప్పుడు శుభ్రప‌రుచుకోవాలి. వంటింట్లో చెత్తను ఎప్పటిక‌ప్పుడు బ‌య‌టపడేస్తుండాలి. వంటింటికి బూజు పట్టకుండా చూసుకోవాలి. కిచెన్ కు వెంటిలేషన్ సరిగ్గా ఉండాలి. అలాగే సింక్ ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.

First Published:  11 Jun 2021 7:33 AM IST
Next Story