Telugu Global
Cinema & Entertainment

మరో రీమేక్ లో సల్మాన్ ఖాన్

సౌత్ లో ఓ సినిమా హిట్టయితే వెంటనే దాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు హీరో సల్మాన్ ఖాన్. ఇప్పటికే ఎన్నో రీమేక్స్ చేసిన ఈ హీరో, ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్టయిన మాస్టర్ పై కన్నేశాడు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా రాథే సినిమాతో అటు ఓటీటీలోకి ఇటు థియేటర్లలోకి ఒకేసారి వచ్చాడు సల్మాన్. మరోవైపు టైగర్-3 సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. […]

మరో రీమేక్ లో సల్మాన్ ఖాన్
X

సౌత్ లో ఓ సినిమా హిట్టయితే వెంటనే దాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు హీరో సల్మాన్
ఖాన్. ఇప్పటికే ఎన్నో రీమేక్స్ చేసిన ఈ హీరో, ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్టయిన మాస్టర్ పై
కన్నేశాడు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

తాజాగా రాథే సినిమాతో అటు ఓటీటీలోకి ఇటు థియేటర్లలోకి ఒకేసారి వచ్చాడు సల్మాన్. మరోవైపు టైగర్-3
సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మాస్టర్ రీమేక్ ను కూడా స్టార్ట్
చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే నెలలో రాబోతోంది. డైరక్టర్ ఎవరనే
విషయాన్ని అప్పుడు ప్రకటిస్తారు.

మాస్టర్ సినిమాతో విజయ్ కు ఎంత పేరొచ్చిందో అందులో విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి కూడా
అంతే పేరొచ్చింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ రీమేక్ లో విలన్ గా ఎవరు నటిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా
మారింది.

First Published:  11 Jun 2021 1:05 PM IST
Next Story