Telugu Global
National

రాహుల్ టీమ్ లో ఎవరెక్కడ..?

ఇందిరాగాంధీ హయాంలో, తన తర్వాతి తరంలో సంజయ్ గాంధీని ప్రోత్సహించే క్రమంలో ఆయన చుట్టూ ఓ యువ కోటరీని ఏర్పాటు చేశారామె. కమల్ నాథ్, అమరీందర్ సింగ్ వంటివారు ఆ కోటరీలోనివారే. ఆ తర్వాత పదహారేళ్ల కాలంలో దాదాపుగా చాలామంది కాంగ్రెస్ ని వీడిపోయారు. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి విఫల ప్రయోగమే జరిగింది. ఈసారి సంజయ్ ప్లేస్ లో రాహుల్ ఉన్నారు. రాహుల్ చుట్టూ ఓ యంగ్ టీమ్ ని ఏర్పాటు చేసింది సోనియా గాంధీ. […]

రాహుల్ టీమ్ లో ఎవరెక్కడ..?
X

ఇందిరాగాంధీ హయాంలో, తన తర్వాతి తరంలో సంజయ్ గాంధీని ప్రోత్సహించే క్రమంలో ఆయన చుట్టూ ఓ యువ కోటరీని ఏర్పాటు చేశారామె. కమల్ నాథ్, అమరీందర్ సింగ్ వంటివారు ఆ కోటరీలోనివారే. ఆ తర్వాత పదహారేళ్ల కాలంలో దాదాపుగా చాలామంది కాంగ్రెస్ ని వీడిపోయారు. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి విఫల ప్రయోగమే జరిగింది. ఈసారి సంజయ్ ప్లేస్ లో రాహుల్ ఉన్నారు. రాహుల్ చుట్టూ ఓ యంగ్ టీమ్ ని ఏర్పాటు చేసింది సోనియా గాంధీ. 2004 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాహుల్ చుట్టూ బలమైన కోటరీ ఏర్పాటు చేేశారామె.

2004 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి అమేథీ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. ఆ సమయానికి జితిన్ ప్రసాద, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, సందీప్ దీక్షిత్, మిలింద్ దియోరా, దీపేందర్ హుడా.. వంటివారు ఆయనతో కలసి లోక్ సభలో ఓ టీమ్ గా ఏర్పడ్డారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అయినా పెత్తనం అంతా ఈ కోటరీదే. కానీ ఇప్పుడు రాహుల్ కోటరీకి బీటలు వారింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరూ చేజారిపోయారు. కష్టకాలంలో రాహుల్ కి అండగా ఉండాల్సిన వారంతా తలోదారి చూసుకున్నారు.

రాజకీయాల్లో తమ వారసులకోసం ప్రత్యేకంగా టీమ్ ని తయారు చేసి, వారికి అండగా ఉండేలా వ్యూహాలు రచిస్తారు సీనియర్ నేతలు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన ఆ టీమ్, సరిగ్గా అవసరం వచ్చేసరికి తలోదారి అయిపోతే అసలుకే మోసం వస్తుంది. సరిగ్గా రాహుల్ గాంధీ విషయంలో కూడా అదే జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారు వెళ్లిపోగా, సచిన్ పైలట్ లాంటి వారిని రాహుల్ పదే పదే బుజ్జగించాల్సి వస్తోంది. తాజాగా జితిన్ ప్రసాద కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాహుల్ టీమ్ దాదాపుగా ముక్కలు చెక్కలైంది. అసలు ఆయన కోటరీయే విచ్ఛిన్నమైపోయింది.

మరోవైపు జి-23 పేరుతో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకి కనీసం ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ కూడా లేరని చురకలంటిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోకుండా రాహుల్ గాంధీ పార్టీపై పెత్తనం చలాయించినంతకాలం భవిష్యత్ ఉండదని అంటున్నారు. సమస్యంతా పై స్థాయిలోనే ఉందని చెబుతున్నారు సీనియర్లు.

ఇటీవల వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దారుణ పరాభవాలను మూటగట్టుకుంటోంది. అదే సమయంలో సీనియర్లు స్వరం పెంచుతున్నారు, తన చుట్టూ ఉన్న నాయకులు పక్కకి వెళ్లిపోతున్నారు. ఈ దశలో రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

First Published:  11 Jun 2021 6:19 AM IST
Next Story