Telugu Global
National

వ్యాక్సిన్ రేట్లలో ఎందుకీ తేడాలు..? కాస్ట్‌లీ కోవాక్సిన్.. కారణం ఏంటి..?

ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్లు ఉచితం అని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చిన 24గంటల్లోగా.. ప్రైవేటు వ్యాక్సిన్ల ధరలను భారీగా పెంచింది. వ్యాక్సిన్ తయారీదారులనుంచి 75శాతం టీకాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 25శాతం వ్యాక్సిన్లను ఆయా సంస్థలు ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకునే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వానికి సదరు కంపెనీలు ఎంతరేటుకి టీకాలు అమ్ముతాయనే విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అయితే ప్రైవేటు ఆస్పత్రులకు అమ్మేరేట్లను భారీగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. […]

వ్యాక్సిన్ రేట్లలో ఎందుకీ తేడాలు..? కాస్ట్‌లీ కోవాక్సిన్.. కారణం ఏంటి..?
X

ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్లు ఉచితం అని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చిన 24గంటల్లోగా.. ప్రైవేటు వ్యాక్సిన్ల ధరలను భారీగా పెంచింది. వ్యాక్సిన్ తయారీదారులనుంచి 75శాతం టీకాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 25శాతం వ్యాక్సిన్లను ఆయా సంస్థలు ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకునే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వానికి సదరు కంపెనీలు ఎంతరేటుకి టీకాలు అమ్ముతాయనే విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అయితే ప్రైవేటు ఆస్పత్రులకు అమ్మేరేట్లను భారీగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. భారత్ లో పంపిణీ చేసే మూడు వ్యాక్సిన్లకు మూడు వేర్వేరు రేట్లు నిర్ణయించడం. వాటి మధ్య కూడా భారీ అంతరాలుండటం.

ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా అయ్యే రేట్లు ఇవీ..
కోవాక్సిన్ ఒక్కో డోసు ధర రూ.1,410
కోవిషీల్డ్ ఒక్కోడోసు రూ.780
స్పుత్నిక్-వి ఒక్కోడోసు 1,145

ధరల్లో ఏమిటీ వ్యత్యాసం..?
మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసుకుని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన కోవిషీల్డ్ రేటు రూ.780గా నిర్ణయించి, కోవాక్సిన్ ధరను మాత్రం ఏకంగా రూ.1,410కి పెంచడం వెనక మతలబు ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. కోవాక్సిన్ కి ఇంకా మూడో దశ ప్రయోగాలు పూర్తికాలేదు, డబ్ల్యూహెచ్ఓ అనుమతి కూడా లేదు. కోవాక్సిన్ సామర్థ్యం 80శాతం మాత్రమే, యాంటీబాడీల విషయంలో టీకా తీసుకోక ముందు, తీసుకున్నాక కూడా తేడా లేదని తేలింది. భారత్ లో కనిపించిన డెల్టా వేరియంట్ పై కోవాక్సిన్ సామర్థ్యం కూడా అంతంతమాత్రమేనని తెలింది. అయినా కూడా ఈ టీకా రేటు రూ.1,410గా నిర్ణయించడం నిజంగానే వింత, విడ్డూరం.

కోవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాల సాంకేతికత విదేశీ కంపెనీలది. కానీ కోవాక్సిన్ ఫార్ములా, తయారీ మొత్తం భారత్ కే సొంతం. టీకా తయారీలో భారత్ బయోటెక్ కి ఐసీఎంఆర్ సహకారం కూడా ఉంది. భారత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా తీసుకున్న కంపెనీ టీకా ధర సహజంగా తక్కువగా ఉండాలి, భారతీయులకు రాయితీపై పంపిణీ చేయాలి. కానీ భారత్ లో పంపిణీ అయ్యే అన్ని టీకాల్లో కోవాక్సిన్ ధరే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం. టీకా రేట్లలో ఉన్న ఈ వ్యత్యాసం ప్రభుత్వంపై విమర్శలకు దారితీస్తోంది.

First Published:  10 Jun 2021 10:45 AM IST
Next Story